కళ్ల కింద బ్లాక్ సర్కిల్స్ వల్ల ఇబ్బంది పడుతున్నారా ? ఈ చిట్కాలు ట్రై చేయండి !!

how-remove-dark-circles

మనలో చాలా మందికి ఎక్కువగా ఉంటున్న సమస్య డార్క్ సర్కిల్స్. నిద్రలేమి వలనో, ఎక్కువ సేపు కంప్యూటర్ ముందు కూర్చోవడం వల్ల.. పిల్లలకైతే ఎక్కువ సేపు మేల్కొని చదవడం వల్ల, ఎండలో బాగా తిరగడం వల్ల.. ఇలా రకరకాల కారణాలతో పిల్లల నుంచి పెద్దవాళ్లవరకూ ఉండే సమస్య డార్క్ సర్కిల్స్. నీరు తక్కువగా తాగే వారిలో, ఆస్తమా ఉన్నవారిలో, విటమిన్ సి లోపం ఉన్నవారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంటుంది. 

కంటి చుట్టూ ఉండే.. ఈ నల్లటి వలయాల కారణంగా ముఖారవిందం పాడవుతుంది. ముఖంలో కళ పోయి.. అందవిహీనంగా తయారవుతుంటుంది. దానిని తగ్గించుకునేందుకు నానా రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరిగి ఎన్నిసార్లు ఫేస్ ప్యాక్ లు వేసుకున్నా.. డార్క్ సర్కిల్స్ కు మాత్రం ఖచ్చితమైన పరిష్కారం కనిపించదు. అలాంటి వారి కోసమే ఈ చిట్కాలు. ఓ సారి ట్రై చేసి చూడండి. 

1. కళ్ల క్రింద, కంటి చుట్టూ ఏర్పడిన నల్లటి వలయాలను పై ప్రతిరోజు రాత్రి స్వచ్ఛమైన తేనెను రాసి.. కొద్దిసేపు మర్దనా చేయాలి. 10 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడుక్కోవాలి. మెత్తటి క్లాత్ తో తుడిచి.. చల్లటి, మెత్తటి బంకమట్టిని కళ్లకింద రాయాలి. ఈ మడ్ ప్యాక్ ను 20 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకూ ఉంచి.. ఆ తర్వాత శుభ్రం చేసుకోవాలి. 

OR 

2. ఒక చెంచా కలబంద గుజ్జులో .. పసుపు, తేనె కలిపి కళ్ల కింద అప్లై చేసి, మర్దనా చేసుకోవాలి. కొద్దిసేపటి తర్వాత చల్లటి నీటితో కళ్లను శుభ్రం చేసుకోవాలి. ఇలా 15 - 20 రోజుల వరకూ చేస్తే.. నల్లటి వలయాలు క్రమంగా తగ్గుతాయి.   

3. రోజూ రాత్రి పూట పడుకునే ముందు కాటన్ కు రోజ్ వాటర్ ను అద్ది.. దానితో కంటి చుట్టూ ఏర్పడిన వలయాలపై 5 నిమిషాల పాటు మర్దనా చేయాలి. 

2. ఆడవారైనా.. మగవారైనా రోజుకు 4 లీటర్లు మంచినీరు తప్పనిసరిగా తాగాలి. ఎండలో తిరిగేవారు 5 లీటర్ల వరకూ తాగాల్సి ఉంటుంది. 

3. ఉదయం పూట టీ, కాఫీలకు బదులుగా క్యారెట్ / టమోటా / బీట్ రూట్ జ్యూస్ లను తాగాలి. 

4. సాయంత్రం వేళల్లో బత్తాయి లేదా కమలా రసం తీసుకోవడం మంచిది. 

5. డిన్నర్ లో అన్నం కాస్త తగ్గించి.. రసాయన రహిత పండ్లను ఆహారంగా తీసుకోవడం వల్ల కళ్ల కింద ఏర్పడిన నల్లటి వలయాలు తగ్గడమే కాకుండా.. చర్మం కాంతివంతంగా కూడా ఉంటుంది.