బెంగాల్ లో కేంద్రమంత్రి మురళీధరన్ కాన్వాయ్ పై దాడి

union-minister-muraleedharan-car-chased-attacked-by-tmc-goons

బీజేపీ ఎంపి, కేంద్ర మంత్రి వి మురళీధరన్ కాన్వాయ్ పై టిఎంసి కార్యకర్తలు గురువారం దాడి చేశారు. దీంతో కారు అద్దాలు పగిలిపోయాయి. గురువారం మిద్నాపూర్‌లో ఈ దాడి జరిగింది. ఈ ఘటనలో ఆయన వ్యక్తిగత సిబ్బందికి గాయాలయ్యాయి. ఇది తృణమూల్‌ గూండాల పనేనంటూ ఆయన ట్వీట్‌ చేశారు. తన వాహనంపై దాడికి సంబంధించిన వీడియోను కూడా షేర్ చేశారు. దాడి జరిగిన వెంటనే పర్యటనను అర్ధాంతరంగా ముగించుకుని ఆయన వెనక్కి వెళ్లిపోయారు.