అమీర్‌పేట్‌ మెట్రో స్టేషన్‌ పైనుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య..!

0
225
Ameerpet metro

అమీర్‌పేట్‌ మైత్రీవనం మెట్రో స్టేషన్‌‌ పైనుంచి దూకి ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సార్‌ నగర్‌ పోలీసుల కథనం ప్రకారం… అమీర్‌పేట్‌ మెట్రోస్టేషన్‌ మొదటి అంతస్తుకు ఎక్కిన ఓ వ్యక్తి సారథి స్టుడియో ప్రహారీ గోడ వైపు ఒక్కసారిగా దూకేశాడు. దీంతో తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు అక్కడికి చేరుకుని మృతుడి వివరాలు గురించి ఆరా తీస్తున్నారు. అతడి ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రి శవాగారానికి తరలించారు. మెట్రో స్టేషన్‌లో ఇలాంటి ఘటన జరగడం ఈ నెలలో ఇది రెండో సారి. గత వారం ఓ మహిళ కుటుంబ కలహాలతో కొత్తపేటలోని విక్టోరియా మెమోరియల్‌ మెట్రో స్టేషన్‌ పైనుంచి దూకేసింది. స్థానికులు ఆమెను వెంటనే ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆమెకు ప్రాణాపాయం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆ ఘటన మరిచిపోకముందే మరో ఘటన జరగడంపై మెట్రో అధికారులు, పోలీసులు ఆలోచనలో పడ్డారు.