ఏయే డ్రై ఫ్రూట్స్ ఎంతెంత తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది !

Uses of dry fruits

కరోనా పుణ్యమా అని అందరికీ ఆరోగ్యంపై ఇంట్రెస్ట్ పెరిగింది. ముఖ్యంగా డ్రై ఫ్రూట్స్ వినియోగం ఎక్కువైంది. చూడటానికి ఎండినవిగా ఉన్న వాటిని తినడం వల్ల ఆరోగ్యానికి మంచిదే. మంచిదన్నారు కదా  అని చాలా మంది ఇష్టమొచ్చినంత తినేస్తుంటారు. డ్రై ఫ్రూట్స్ లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే.. షుగర్స్, క్యాలరీలు కూడా ఉంటాయి. కాబట్టి వీటిని 20 గ్రాముల కంటే ఎక్కువ తినకూడదు. అలాగే డైరెక్ట్ గా తినడం కూడా మంచిది కాదు. కాబట్టి.. డ్రై ఫ్రూట్స్ తినే విధానం, ఏ నట్స్ ఎంత పరిమాణంలో తినాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

1. బాదం : పిల్లల, పెద్దలు ఎక్కువగా ఇష్టపడే డ్రై ఫ్రూట్స్ లో ఇది ఒకటి. బాదం పప్పు డైరెక్ట్ గా తినడం వల్ల శరీరంలో వేడి పెరుగుతుంది. కాబట్టి రాత్రి పూట పడుకునే ముందు గోరువెచ్చటి నీటిలో మనిషికి (పెద్దవాళ్లకి) ఏడు చొప్పున, పిల్లలకైతే 10 పప్పులు నానబెట్టి.. ఉదయాన్నే ఆ నీటిని వంచి, పప్పుపై ఉన్న తోలు వలుచుకుని తినాలి. బాదాంపప్పులో మోనో శ్యాచురేటెడ్ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి హార్ట్ కి, బ్రెయిన్ కి , స్కిన్ కి మంచిది. అలాగే వీటిలో ఉండే విటమిన్ ఈ, మెగ్నీషియం, పొటాషియంలు బ్లడ్ ప్రెజర్ నార్మల్ గా ఉండేందుకు తోడ్పడుతాయి. 

2. వాల్ నట్స్ : వీటిని పెద్దగా ఇష్టపడరు. కానీ.. వీటిపై ఉండే స్కిన్ లో 90 శాతం యాంటీ ఆక్సిడెంట్స్, ఫెనోలిక్ యాసిడ్స్, టాన్నిన్స్, ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. గుండె సంబంధిత వ్యాధుల నుంచి రక్షించడంలో ఇవి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. రోజుకి 3 నుంచి 4 వాల్ నట్స్ తినడం వల్ల గుండెకి చాలా మంచిది. 

3. కర్జూరం : ఈ డ్రైట్స్ ఫ్రూట్ ను పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. మనుషులు ఆరోగ్యకరంగా ఉండేందుకు కావాల్సిన న్యూట్రియంట్స్, విటమిన్స్, మినరల్స్ కర్జూరాల్లో పుష్కలంగా దొరుకుతాయి. మెటబాలిజం స్థాయి చురుగ్గా ఉండేందుకు ఇది ఉపయోగపడుతుంది. మీడియం సైజులో ఉండే కర్జూరాలు రోజుకి 1 లేదా రెండు తీసుకుంటే చాలు.. ఎనర్జీ లెవల్స్ కూడా పెరుగుతాయి. 

4. పిస్తా : ఈ డ్రై ఫ్రూట్ వెల్ నెస్ కి చిహ్నం. చాలా మంది తమ డైట్ లో తీసుకునే డ్రై ఫ్రూట్ కూడా ఇదే. కానీ దీనిని అధికంగా తీసుకోకూడదు. రోజుకు 20 గ్రాముల చొప్పున తింటే చాలు. అన్ని డ్రై ఫ్రూట్స్ లో కన్న వీటిలో ప్రొటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. 

5. జీడిపప్పు : అందరూ ఇష్టపడే డ్రై ఫ్రూట్ ఇది. జీడిపప్పును ప్రతిరోజూ డైట్ లో తీసుకోవడం వల్ల కిడ్నీల్లో రాళ్లు ఏర్పడకుండా నివారించవచ్చని వైద్యులు చెప్తున్నారు. అలాగని అమితంగా తింటే శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. వారానికి 28 జీడిపప్పులు.. అంటే రోజుకి 4 జీడిపప్పులు తింటే కిడ్నీలకు మంచిది. 

6. ఎండు ద్రాక్ష : ఎండుద్రాక్ష రోజుకు ఎంత తింటే అంత మంచిది. వీటిని ఎక్కువగా తిన్నా ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. సహజంగానే తీపిని కలిగి ఉంటాయి కాబట్టి.. షుగర్ పేషెంట్స్ కూడా తినొచ్చు. వీటిలో విటమిన్ బి, పొటాషియం, ఐరన్ పుష్కలంగా లభిస్తాయి. మహిళలైతే రోజుకొక ఒకటిన్నర కప్పు, మగవాళ్లైతే రెండు కప్పుల ఎండుద్రాక్ష తినొచ్చు. రక్తప్రసరణను బాగుచేయడంలో ఎండుద్రాక్ష తోడ్పడుతుంది.