ప్రముఖ నటి బీ జయ కన్నుమూత

veteran-kannada-actress-b-jaya-dies-77

కన్నడ చిత్ర పరిశ్రమ మరో నటిని కోల్పోయింది. ప్రముఖ నటి బి జయ కన్నుమూశారు. ఆమె వయస్సు 77 సంవత్సరాలు. కొంతకాలంగా వయస్సు సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న   ఆమె బెంగళూరులోని కరుణశ్రమ ఆసుపత్రిలో చికిత్స పొందుతోండగా.. జూన్ 3, గురువారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. 1944 లో జన్మించిన జయ.. థియేటర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించారు. 

1958 లో భక్త ప్రహలాదతో కలిసి చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించారు. ఆరు దశాబ్దాల కెరీర్‌లో 350కి పైగా సినిమాల్లో నటించారు, ఎక్కువగా సహాయక పాత్రలలో కనిపించరు. డాక్టర్ రాజ్‌కుమార్, కల్యాణ్ కుమార్, ఉదయ్ కుమార్, ద్వారకీష్ , మరియు బాలకృష్ణ వంటి మొదటి తరం తారలతో ఆమె స్క్రీన్ షేర్ చేసుకున్నారు. తరువాతి సంవత్సరాల్లో, ఆమె టెలివిజన్ సీరియళ్లలో కూడా కనిపించరు. 2004-05లో, గౌడ్రూలో నటించినందుకు ఉత్తమ సహాయక పాత్ర అవార్డును గెలుచుకున్నారు. జయ మృతిపట్ల కన్నడ చిత్ర పరిశ్రమ సంతాపం తెలిపింది.