గుండెపోటుతో కన్నడ నటి సురేఖ మృతి

veteran-kannada-actress-surekha-dies-after-suffering-heart-attack

ప్రముఖ కన్నడ నటి, నర్తకి సురేఖా గుండెపోటుతో కన్నుమూశారు. ఆమె వయసు 66 సంవత్సరాలు. రాత్రి 9.30 గంటల సమయంలో టీవీ చూస్తుండగా ఆమెకు గుండెపోటు వచ్చింది.. దీంతో కుటుంబసభ్యులు సురేఖను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు, అయితే ఆమె అప్పటికే మరణించారని వైద్యులు తెలిపారు. కాగా సురేఖకు అతని ఇద్దరు సోదరీమణులు..

శారదా మరియు ప్రేమా ఉన్నారు. ఆమె తుది కర్మలు ఆదివారం బనశంకరి శ్మశానవాటికలో జరిగాయి. కాగా సురేఖ 160 కి పైగా సినిమాల్లో నటించారు, ఇందులో థాయ్ దేవరు, శివకన్య, కావేరి, కేసరినా కమలా, ఆపరేషన్ జాక్‌పాట్ నల్లి సిఐడి, సిఐడి 999, బ్యాంకర్ మార్గయ్య, నాగర హోల్ తదితర చిత్రాలు ఉన్నాయి.