కోహ్లి వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసిన బంగ్లాదేశ్ ఫాన్స్

0
204
virat kohli website hacked

బంగ్లాదేశ్‌ ఫ్యాన్స్‌ ప్రతీకార చర్యకు పాల్పడ్డారు. భారత్‌తో జరిగిన ఆసియాకప్‌ ఫైనల్లో బంగ్లాదేశ్‌ ఆటగాడు లిటన్‌ దాస్‌ను థర్డ్‌ అంపైర్‌ స్టంపౌట్‌గా ప్రకటించడం వివాదస్పదమైన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ నిర్ణయంపై సోషల్‌ మీడియా వేదికగా బంగ్లా ఫ్యాన్స్‌ ఏకీపారేశారు. తమ సెంచరీ హీరో లిటన్ దాస్‌ నాటౌట్ అయినా ఔటివ్వడం వల్లే టైటిల్‌ చేజారిందని బంగ్లాదేశ్ అభిమానులు ప్రతీకార చర్యకు పాల్పడ్డారు. ఇందులో భాగంగా కొందరు ఫ్యాన్స్ భారత కెప్టెన్ విరాట్ కోహ్లి అఫిషియల్ వెబ్‌సైట్‌ను హ్యాక్ చేశారు.

virat kohli website hacked

ఈ ఫైనల్‌ మ్యాచ్‌లో సెంచరీ నమోదు చేసిన లిటన్‌ దాస్‌(121) కుల్దీప్‌ వేసిన గూగ్లీని ఆడేందుకు ముందుకు వెళ్లాడు. బంతి మిస్‌ కావడంతో అంతే వేగంగా క్రీజు లైన్‌పై కాలు పెట్టాడు. కానీ అప్పటికే ఎంఎస్‌ ధోని చాలా వేగంగా వికెట్లను గిరటేశాడు. దీంతో ఫీల్డ్‌ అంపైర్‌ థర్డ్‌ అంపైర్‌ను సంప్రదించాడు. పలు కోణాల్లో  పరిశీలించిన థర్డ్‌ అంపైర్‌ లిటన్‌ దాస్‌ను ఔట్‌గా ప్రకటించాడు. అదే సమయంలో థర్డ్‌ అంపైర్‌ బెనిఫిట్‌ ఆఫ్‌ డౌట్‌ కింద నిర్ణయం బ్యాట్స్‌మన్‌కు అనుకూలంగా ఇవ్వకపోవడాన్ని బంగ్లా ఫ్యాన్స్ ప్రశ్నిస్తురు.