ఎన్.టి.ఆర్ ” టెంపర్” రీమేక్‌ లో విశాల్..!!

0
266
Vishal new Movie First Look

ఒక‌పుడు ర‌జ‌నీకాంత్ తెగ సిగ‌రెట్లు కాల్చేవాడు. ఆయ‌న సినిమాల్లోనూ, సినిమా పోస్ట‌ర్స్‌లోనూ స్మోకింగ్ దృశ్యాలుండేవి. ఐతే ర‌జ‌నీకాంత్ ఆ త‌ర్వాత త‌న సినిమా పోస్ట‌ర్స్‌పై సిగ‌రెట్ కాల్చే ఫోటోలుండ‌కుండా జాగ్ర‌త్త‌ప‌డుతున్నాడు. సిగ‌రెట్ సీన్లు క‌ట్ చేసి, చూయింగ్ గ‌మ్‌, రూపాయి బిల్ల‌ల‌తో ర‌క‌ర‌కాల విన్యాసాలు చేసే సీన్ల‌ని యాడ్ చేశాడు. బీరు బాటిల్ పట్టుకుని ఉన్న విశాల్ కొత్త సినిమా పోస్టర్ పై తమిళనాట వివాదం రాజుకుంటోంది. తెలుగులో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హిట్గా నిలిచిన టెంపర్ చిత్రాన్ని విశాల్ తమిళంలో ‘అయోగ్య’ పేరుతో రీమేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పోస్టర్‌ను సోమవారం చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పోస్టర్ లో విశాల్ పోలీసు జీపుపై బీరుబాటిల్ పట్టుకుని కూర్చున్న సన్నివేశం ఉంది. ఇదే ఇప్పుడు తమిళుల్లో ఆగ్రహం తెప్పిస్తుంది.vishal temper

ధూమ‌పానం, మద్యపానంపై పోరాడుతున్న పిఎంకె పార్టీ అధ్య‌క్షుడు రాందాస్ విశాల్ పై విరుచుకు పడ్డారు. ఫ్యాన్స్‌కి ఏమి సందేశం ఇస్తున్నారు ఈ ఫోటోతో అని ఆయ‌న మండిప‌డుతున్నారు. విశాల్ పొద్దున లేవ‌గానే నీతి సూత్రాలు వ‌ల్లిస్తుంటాడు..పోస్ట‌ర్స్‌ల‌లో ఇలాంటివా అంటూ ఆయ‌న విమ‌ర్శిస్తున్నారు. బాధ్యతాయుత పదవుల్లో ఉండటమే కాకుండా సమాజానికి మంచి చెప్పే హీరో ఇటువంటి సన్నివేశాల్లో నటించటం ద్వారా సమాజానికి ఎటువంటి సందేశం ఇస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. అయితే ఈ ‘అయోగ్య’ వివాదం ఎక్కడికి వెళుతుందోనని తమిళ చిత్రసీమ ఆందోళనలో ఉంది.