24న వైజాగ్ లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్‌ వన్డే..!!

0
89
vizag to host india vs west indies second ODI

భారత్, వెస్టిండీస్‌ మధ్య రెండో వన్డే నిర్వహణకు సంబంధించి మధ్యప్రదేశ్‌ క్రికెట్‌ సంఘంలో చెలరేగిన వివాదం విశాఖపట్నం అభిమానులకు కలిసొచ్చి ంది. ఈ నెల 24న ఇండోర్‌లోని హోల్కర్‌ స్టేడియంలో మ్యాచ్‌ జరగాల్సి ఉండగా… కాంప్లిమెంటరీ పాస్‌ల గొడవ ఎంతకీ తేలకపోవడంతో వేదికను మార్చాలని బీసీసీఐ నిర్ణయించింది.

ఈ మ్యాచ్‌ను అదే తేదీన విశాఖపట్నంలో నిర్వహిస్తున్నట్లు బోర్డు బుధవారం అధికారికంగా ప్రకటించింది. వైజాగ్‌లోని డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఏసీఏ–వీడీసీఏ స్టేడియం ఇప్పటి వరకు 7 వన్డేలకు ఆతిథ్యమిచ్చింది.