విరాట్ కోహ్లీకి అరుదైన గౌర‌వం.. ఆ అవార్డు అందుకుంటున్న మూడో భార‌తీయుడు!

విరాట్ కోహ్లీకి అరుదైన గౌర‌వం.. ఆ అవార్డు అందుకుంటున్న మూడో భార‌తీయుడు!

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లికి అరుదైన గౌర‌వం ద‌క్కింది. భార‌త ప‌రుగుల వీరుడు కోహ్లీ త‌న ఖాతాలో మ‌రో అత్యుత్త‌మ అవార్డును కైవ‌సం చేసుకున్నారు. వన్డేల్లో గత కొన్నేళ్లుగా అత్యుత్తమంగా రాణిస్తున్న విరాట్ కోహ్లీ.. విస్డెన్‌ అత్యుత్తమ వన్డే క్రికెటర్‌ ఆఫ్‌ ది డికేడ్‌(2010) అవార్డుకు ఎంపికయ్యాడు. 2010-2020 మధ్యకాలంలో వన్డేల్లో అత్యున్న‌త‌మైన ఆట తీరును క‌న‌బ‌రిచారు. 2011 వన్డే ప్రపంచకప్‌తో దశాబ్దాన్ని ప్రారంభించిన ​కోహ్లి..  అసాధారణరీతిలో విరాట్ కోహ్లీ శతకాలు నమోదు చేసిన విషయం తెలిసిందే.

ఆ దశాబ్దంలో దాదాపు 60 సగటుతో పరుగులు రాబట్టిన కోహ్లీ ఏకంగా 11,000 పరుగులు చేశాడు. ఇందులో 42 సెంచరీలు ఉన్నాయి. 2011 ప్రపంచకప్‌లో 9 మ్యాచ్‌ల్లో ఓ శతకం మరో అర్ధశతకం సాయంతో 282 పరుగులు సాధించిన కోహ్లి..  భారత్‌ను రెండోసారి జగజ్జేతగా నిలపడంలో తనవంతు పాత్రను పోషించాడు.  

ఫస్ట్ ఇంటర్నేషనల్ వన్డే జరిగి 50 ఏళ్లు గడిచిన సందర్భంగా విజ్డెన్.. ఈ అవార్డుల‌ను ప్ర‌ధానం చేస్తుంది.  ఈ క్రమంలో 1970-80 దశాబ్దానికిగానూ వెస్టిండీస్ దిగ్గజం వివ్ రిచర్డ్స్ ఎంపిక కాగా.. 1980-90 దశాబ్దంలో భారత దిగ్గజం కెప్టెన్ కపిల్‌దేవ్‌కి  ఈ గౌరవం ల‌భించింది. అనంతరం 1990-2000 దశాబ్దానికి భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కు ఈ గౌర‌వం ల‌భించింది. 2000-2010 దశాబ్దానికి గానూ.. శ్రీలంక స్పిన్ మాంత్రికుడు ముత్తయ్ మురళీధరన్‌కి ద‌క్కింది.  తాజాగా 2010-2020 దశాబ్దానికి కోహ్లీ ఎంపికయ్యాడు.