యాంకర్ శ్యామల భర్తపై మహిళ ఫిర్యాదు.. అరెస్ట్!

Woman complains against Anchor Shyamala's husband

యాంకర్ శ్యామల భర్త, నటుడు నరసింహరెడ్డిపై హైదరాబాద్ లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు నమోదు అయింది. నరసింహరెడ్డి తనవద్ద కోటి రూపాయలు తీసుకొని తిరిగి ఇవ్వడం లేదని ఓ మహిళా పోలీసులకు ఫిర్యాదు చేసింది. Also Read :ఆక్సిజన్ విషయంలో ప్రశ్నించాల్సింది 'జగన్ ను కాదు మోదీ'ని పవన్ జీ..  2017 నుంచి ఇప్పటివరకూ డబ్బు తీసుకున్నట్లు సదరు మహిళ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే తన డబ్బు అడిగితే బెదిరిస్తున్నాడని ఆమె ఆరోపిస్తోంది. 

డబ్బు తీసుకోవడమే కాక తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆమె ఆరోపించింది. అయితే ఈ కేసులో సెటిల్ మెంటు చేసుకోవాలంటూ నరసింహరెడ్డి భర్త తరఫున మరో మహిళ రాయబారం నడిపింది. దీంతో ఈ కేసులో నరసింహరెడ్డి తోపాటు రాయబారం నడిపిన మహిళను పోలీసులు అరెస్టు చేశారు.. కోర్టు సూచన మేరకు రిమాండ్ కు తరలించారు.