షావోమి రిపబ్లిక్ డే సేల్‌ : ఫోన్ల ధరలు భారీగా తగ్గింపు

xiaomi-republic-day-sale-early-access-begins

షియోమి మొబైల్స్ సంస్థ భారతదేశంలో ఫ్లిప్‌కార్ట్ , అమెజాన్‌లతో పాటు రిపబ్లిక్ డే సేల్‌ను తన సొంత వెబ్‌సైట్ మి.కామ్‌లో నిర్వహిస్తోంది. ఈ అమ్మకం జనవరి 20 నుండి జనవరి 24 వరకు జరుగుతుంది. ఫ్లిప్‌కార్ట్ విఐపి, అమెజాన్ ప్రైమ్ మరియు మి విఐపి క్లబ్ సభ్యులకు ఒకరోజు ముందుగానే ఈ సేల్ లో పాల్గొనే అవకాశం ఇచ్చింది. రెడ్‌మి నోట్ 9 సిరీస్, రెడ్‌మి 9 ప్రైమ్, మరియు రెడ్‌మి 9 ఐ ధరలు ఈ సేల్ లో తగ్గింపుతో వస్తున్నాయి. రెడ్‌మి స్మార్ట్ బ్యాండ్, మి స్మార్ట్ బ్యాండ్ 4, మరియు మి వాచ్ రివాల్వ్ కూడా తగ్గింపు ధరలకు రానున్నాయి. రిపబ్లిక్ డే అమ్మకంలో రెడ్‌మి ఇయర్‌బడ్స్ ఎస్, మి స్మార్ట్ వాటర్ ప్యూరిఫైయర్, మి టివి స్టిక్ మరియు మరిన్ని ఉత్పత్తులపై ఆఫర్లు , డిస్కౌంట్‌లు ఇచ్చింది. 

రెడ్‌మి సిరీస్‌ లో ఆఫర్లు
రెడ్‌మి 9 ఐ  4 జీబీ + 64 జిబి స్టోరేజ్ మోడల్ ధర రూ. 7,999  లభ్యం.  ఎంఆర్‌పీ ధర 8,299
రెడ్‌మి 9 ప్రైమ్ 4 జీబీ + 64 జీబీ స్టోరేజ్ మోడల్  రూ. 9,499 రూ. 500 డిస్కౌంట్ 
రెడ్‌మి నోట్ 9 6జీబీ + 128 జిబి స్టోరేజ్  వేరియంట్‌ ధర రూ. 13,999 (రూ. 1,000 తగ్గింపు)
రెడ్‌మి నోట్ 9 ప్రో 4 జీబీ + 128 జీబీ స్టోరేజ్  ప్రస్తుత ధర  రూ.13,999,  రూ. 2,000.  తగ్గింపు 
రెడ్‌మి నోట్ 9 ప్రో మాక్స్  6 జిబి + 64 జీబీ స్టోరేజ్ రూ. 17,499
అలాగే పాత ఫోన్ల  మార్పిడి ద్వారా  2,000 తగ్గింపు లభ్యం.