భారత మాజీ క్రికెటర్ యశ్‌పాల్ శర్మ గుండెపోటుతో మృతి

Yashpal Sharma, member of India's 1983 World Cup winning team, passes away after suffering cardiac arrest

కపిల్ దేవ్ నేతృత్వంలోని ప్రపంచ కప్ విజేత జట్టులో సభ్యుడిగా ఉన్న భారత మాజీ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ యశ్‌పాల్ శర్మ గుండెపోటుతో మంగళవారం కన్నుమూశారు. ఆయన 37 వన్డేలు మరియు 42 టెస్టులలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు.. 1979-83 వరకు భారత మిడిల్ ఆర్డర్లో కీలకమైన ఆటగాడిగా ఉన్నారు. క్రికెట్ నుంచి వైదొలిగిన అనంతరం కొన్ని సంవత్సరాలు జాతీయ సెలెక్టర్గా కూడా పనిచేశారు.. 

తన టెస్ట్ కెరీర్‌లో 33.45 సగటుతో 1606 పరుగులు చేశాడు, ఇందులో 2 సెంచరీలు, తొమ్మిది అర్ధ సెంచరీలు ఉన్నాయి. వన్డేల్లో, అతను 28.48 సగటుతో 883 పరుగులు చేశారు, ఇందులో నాలుగు అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఇక రెండు ఫార్మాట్లలో ఒక్కొక్క వికెట్ రెండు వికెట్లు తీశారు. యశ్‌పాల్ శర్మ మృతిపట్ల క్రెకెటర్లు సంతాపం తెలుపుతున్నారు.