పీవీ.సింధుకు రెండెకరాల భూమిని కేటాయించిన వైసీపీ ప్రభుత్వం

YCP government allotted two acars of land to PV Sindhu

బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ.సింధుకు ఏపీ ప్రభుత్వం రెండెకరాల భూమిని కేటాయించింది. ఈ మేరకు విశాఖ జిల్లా చినగ‌డిలి గ్రామంలో రెండు ఎక‌రాలు భూమిని కేటాయిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. చినగ‌డిలిలోని ఆ భూమిని ప‌శుసంవ‌ర్ధ‌క శాఖ‌నుండి యువ‌జ‌న స‌ర్వీసులు, క్రీడల‌కు బ‌ద‌లాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ స్ధ‌లంలో సింధూ బ్యాడ్మింటన్ అకాడ‌మీ, స్పోర్ట్స్ స్కూలు ఏర్పాటు చేయాలనీ ఉత్త‌ర్వుల్లో పేర్కొంది. ఈ భూమిని అకాడమీ కోసం మాత్రమే వినియోగించాలని.. కమర్షియల్ అవసరాలకు వాడకూడదని వెల్లడించింది.