అలైనా కస్టర్‌ వెయిటర్ కు 7.3లక్షలు టిప్ ఇచ్చిన మిస్టర్ బీస్ట్

0
271
Youtube Star mister beast tip to alaina custer

నిన్ననే కర్ణాటకకు చెందిన మంత్రి ఒకరు ఓ హోటల్‌కు వెళ్లి అక్కడి సిబ్బందికి రూ. 20వేల టిప్ ఇచ్చారు. కానీ ఈ వ్యక్తి మాత్రం ఏకంగా 10వేల డాలర్ల (దాదాపు రూ. 7.3లక్షలు) టిప్‌ ఇచ్చాడు. మరి ఇంతకీ ఆయన ఆర్డర్‌ చేసింది ఏంటో తెలుసా.. రెండు గ్లాసుల మంచినీళ్లు. నమ్మడం లేదు కదూ.. కానీ ఇది అక్షరాల నిజం.

అమెరికాకు చెందిన ప్రముఖ యూట్యూబ్‌ స్టార్ మిస్టర్‌ బీస్ట్‌ గత శనివారం ఉత్తర కరోలినాలోని గ్రీన్‌విల్లేలో ఉండే సూప్‌ డాగ్స్‌ అనే రెస్టారెంట్‌కు వెళ్లారు. అక్కడ బీస్ట్‌ రెండు గ్లాసుల మంచినీళ్లు ఆర్డర్‌ చేయగా సర్వర్‌గా పనిచేస్తున్న అలైనా కస్టర్‌.. బీస్ట్‌కు సర్వ్‌ చేసింది. నీళ్లు తాగేసి బీస్ట్‌ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత అలైనా టేబుల్‌ దగ్గరకు వెళ్లి చూడగా.. పది వేల డాలర్ల నోట్ల కట్ట కన్పించింది. అది చూసి తొలుత అలైనా షాక్‌కు గురైంది. తనతో ఎవరైనా జోక్ చేస్తున్నారేమో అని అక్కడున్నవాళ్లను అడిగింది. అయితే టేబుల్‌ మీదున్న చీటి చూసిన తర్వాత అలైనా సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బయింది. ‘రుచికరమైన నీటిని అందించినందుకు కృతజ్ఞతలు’ అని చీటి రాసి బీస్ట్‌ అలైనాకు 10వేల డాలర్ల టిప్‌ ఇచ్చారు.

ఈ విషయాన్ని సూప్‌ డాగ్స్‌ రెస్టారెంట్‌ తమ ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా పంచుకుంటూ అలైనా ఫొటోలను షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. బీస్ట్‌ ఉదారతను పలువురు నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.