వీడియో: వైయస్ జగన్‌ పుట్టినరోజు వేడుకలు

0
225

ఆరోపణలు,విమర్శలు..రాజకీయాలలో సహజం.అవి వాస్తవమా… అవాస్తవమా అనేది న్యాయస్థానం ఎలానూ తేలుస్తుంది..అయితే ఏళ్లతరబడి సాగదీయడమూ ఒక రాజకీయమే, వదిలి వచ్చిన మాతృ పార్టీ కాంగ్రెస్..అధికారం లో ఉన్న పార్టీ టిడిపి, అధికారం లో ఉన్న టిడిపి పార్టీ కి మద్దత్తు గా నిలిచిన పార్టీ లు.ముందుకు సాగుతున్న అసహాయ శూరుడు అలుపెరుగని పోరాట యోధుడు అయిన వైయస్ జగన్ మోహన్ రెడ్డి తను నమ్మిన బాటలో నడుస్తూ, తన సామర్ధ్యం తో గెలిపించుకున్న వారు ఇతర పార్టీ పాలు అవుతున్నా ఒక మంచి రేపటి ఉదయం కోసం ఎదురుచూస్తున్న వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్తీ అద్యక్ష్యుడు, ఆంధ్ర ప్రదేశ్ ప్రతిపక్ష నేత వై యస్ జగన్ మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు.

జనంతోనే నిరంతరం

నిత్యం ప్రజల మధ్య ఉంటూ.. ప్రజల కోసం తపించే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి జన్మదిన వేడుకలను అభిమానులు, కార్యకర్తలు ఘనంగా జరుపుకుంటున్నారు. డిసెంబర్‌ 21 జననేత పుట్టిన రోజు కావడంతో.. ఒకరోజు ముందుగానే అభిమానులు ఆయన జన్మదిన వేడుకలను ప్రారంభించారు. రాష్ట్రంలోని పలుచోట్ల కేక్‌లు కట్‌చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.