రంగారెడ్డి జిల్లాలో వైఎస్ షర్మిల పర్యటన

YS Sharmila to visit Rangareddy district tomorrow

జులై 8న రాజకీయ పార్టీని ప్రారంభిస్తానని ఇప్పటికే ప్రకటించిన వైఎస్ షర్మిల.. పార్టీ బలోపేతానికి వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రజల సమస్యలను అధ్యయనం చేయడానికి  ఆయా జిల్లాల్లో పర్యటిస్తున్నారు.. ఈ క్రమంలో శుక్రవారం రంగారెడ్డి జిల్లాలో వైయస్ షర్మిల పర్యటించనున్నారు. 

ఈ సందర్బంగా  ఐకెపి సెంటర్లలో ఉన్న ధ్యాన్యాన్ని ఆమె పరిశీలించనున్నారు. అనంతరం అక్కడ రైతుల సమస్యలను అడిగి  తెలుసుకోనున్నారు. ఇందుకోసం షర్మిల అనుచరులు ఇందిరా శోభన్, పిట్టా రామిరెడ్డి, కొండా రాఘవరెడ్డి ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు ఉదయం 11 గంటలకు షర్మిల పర్యటన ఉండనుంది.