వైసీపీ అధికారంలోకి రావాలంటే జ్యోతుల నెహ్రూను గెలిపించాలి : వైవీ సుబ్బారెడ్డి

0
172
Jyothula Nehru

రాష్ట్ర వైసీపీ నాయకుడు, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి జగ్గంపేట వైసీపీ కోఆర్డినేటర్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన బూత్‌ కమిటీ సమావేశానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సభను కోఆర్డినేటర్‌ జ్యోతుల చంటిబాబు వేదికపైనుండగానే నియోజకవర్గంలోని సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి రావాలంటే జ్యోతుల నెహ్రూను గెలిపించాలని వైవీ సుబ్బారెడ్డి, యువనాయకుడు అనంతబాబుల నోట వచ్చింది. దీంతో సభకు వచ్చిన బూత్‌కమిటీ సభ్యులు, కార్యకర్తలు సభావేదిక మీద ఉన్నవారు అవాక్కయ్యారు. సుబ్బారెడ్డే కాకుండా జిల్లా నాయకుడైన అనంతబాబు నోట వెంట కూడా జ్యోతుల నెహ్రూను అత్యధిక మొజారిటీతో గెలిపించాలని చెప్పడంతో సభావేదిక వద్ద ఉన్నవారు ఆశ్చర్య పోయారు. నెహ్రూ పేరును ప్రస్తావించడంతో పార్టీ వర్గీయులు తెగ చర్చించుకున్నారు. సభావేదిక మీద ఉన్నవారు వక్తలకు తెలియజెప్పడంతో తిరిగి జ్యోతుల చంటిబాబు పేరును ప్రస్తావించారు.