సీఎం జగన్ కు రఘురామకృష్ణరాజు లేఖ

ysrcp-mp-raghu-ramakrishna-raju-writes-to-cm-ys-jagan-over-pensions

ఏపీ ప్రభుత్వం నరసాపురం వివాదాస్పద ఎంపీ రఘురామకృష్ణరాజు ఊహించని విధంగా  ట్విస్ట్ ఇచ్చారు. కొద్దిరోజుల కిందటి వరకూ ప్రభుత్వాన్ని, వైసీపీ పెద్దలను దారుణంగా తిట్టిపోసిన ఆయన.. మరోమారు నేరుగా సీఎం జగన్‌కి లేఖ రాసి చర్చకు దారితీశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని కోరారు.  

వృద్ధాప్య పింఛన్లను తక్షణమే పెంచాలని.. ఈ నెల నుంచి రూ.2,750 చెల్లించాలని రఘురామ కోరారు. పింఛన్లను రూ.2 వేల నుంచి రూ.3 వేలకు పెంచుతామని ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్లు లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికైనా ఆ హామీని నెరవేర్చి మాట నిలబెట్టుకోవాలని ఆయన సీఎం జగన్ కు సూచించారు. అంతేకాకుండా పెండింగ్ పడిన పింఛన్ కూడా ఇవ్వాలని ముఖ్యమంత్రిని కోరారు.