DOT NEWS

దత్తపుత్రుడు.. దత్తతండ్రి కుటుంబాలను చీలుస్తారు!

Date:

పొత్తులు పెట్టుకోవడమే కాకుండా కుటుంబాలను కూడా చీలుస్తున్నారని చంద్రబాబు, పవన్ లను ఉద్దేశించి సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు.

బుధవారం కాకినాడలో జరిగిన బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌లపై విరుచుకుపడ్డారు. జైలు దగ్గరకు వెళ్లి దత్తపుత్రుడు.. దత్తతండ్రిని పరామర్శిస్తాడు.

అంత అవినీతిపరుడు ప్రపంచంలో ఎక్కడా లేకపోయినా ఆ పెద్దమనిషి చాలా మంచోడని ఈయన సర్టిఫికెట్‌ ఇస్తారు. మన ప్రభుత్వానికి వచ్చేసరికి అవినీతి జరగకపోయినా అభాండాలు వేస్తున్నారు. చంద్రబాబు అవినీతి చేసినా ఆయన నోరు ఎందుకు మెదపరంటే దానిలో ఈయన కూడా భాగస్వామి కాబట్టి’’ అని విమర్శించారు .

రాబోయే రోజుల్లో పొత్తులు ఎక్కువగా పెట్టుకుంటారు. కుటుంబాలను అడ్డగోలుగా చీలుస్తారు. రాజకీయాలు చేస్తారు.. అబద్ధాలు చెబుతారు. మోసాలు, కుట్రలు, కుతంత్రాలు ఎక్కువగా జరుగుతాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.

కుట్రలు చేయడం, అబద్ధాలు ఆడటం నాకు చేతకాదు. వారిలో రాజకీయాలు చేతకాదు. నాకు తెలిసిన రాజకీయం ఒక్కటే మంచి చేయడం పేదవాడికి అండగా ఉండడం.

మీ బిడ్డ నమ్ముకున్నది పొత్తులు, ఎత్తులు, చిత్తులు, కుయుక్తులు, కుట్రలను కాదు. పైనున్న దేవుని కింద మిమ్మల్ని.. మధ్యలో ఉన్న దళారులు ఎవరిని నమ్ముకోలేదు. అప్రమత్తంగా ఉండండి అని మరోసారి ప్రజలకు విన్నవించారు సీఎం జగన్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

అల్లు అర్జున్‌ కు రెగ్యులర్‌ బెయిల్‌

సంధ్యా థియేటర్‌ తొక్కిసలాట ఘటనలో హీరో అల్లు అర్జున్‌ కు ఊరట...

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా #BSS12 ఫస్ట్ లుక్ రీలీజ్ చేసిన మూవీ మేకర్స్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా లూధీర్ బైరెడ్డి, మహేష్ చందు,...

టీజర్ తో పిచ్చెక్కించిన కన్నడ హీరో గోల్డెన్ స్టార్ గణేష్..

గోల్డెన్ స్టార్ గణేష్ అప్ కమింగ్ మూవీ 'పినాక' మోస్ట్ అవైటెడ్...