DOT NEWS

పార్టీ మారినంత మాత్రాన.. మా గెలుపును ఎవరూ ఆపలేరు

Date:

అసమతి నేతలు కొంతమంది పార్టీ మారినంత మాత్రాన వైఎస్ఆర్ సీపీ గెలుపును ఆపలేరని ఆ పార్టీ కీలక నేత ఇవి సుబ్బారెడ్డి అన్నారు. సీఎం వైఎస్ జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలు, పాలన వైసీపీకి బలమని ఆయన చెప్పారు. ఆ పార్టీ ముఖ్య నేత, జగన్ చిన్నాన్న వైవీ సుబ్బారెడ్డి.. ప్రకాశం జిల్లా పర్యటనలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఏపీలో సంక్షేమ పథకాల ద్వారా లబ్దిపొందుతున్న పేదలందరూ వైసీపీని మరోసారి గెలిపించి వైఎస్ జగన్ ను సీఎంని చేస్తారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

బీసీలకు సీట్లు ఇవ్వటం కోసమే కొన్ని సీట్లు సర్దుబాటు చేయాల్సి వస్తుంది.. ఒకరిద్దరు వెళ్లటం వల్ల మాకేమీ నష్టం లేదన్నారు. కొందరు వారి వ్యక్తిగత కారణాల బయటకు వెళ్తున్నారు.. వెళ్లే వాళ్ల భవిష్యత్తుకు భరోసా ఇచ్చినా వెళ్తున్నారని విమర్శించారు. సీఎం జగన్.. ఏ నిర్ణయం తీసుకున్నా అందరూ కట్టుబడి ఉండాల్సిందేనని స్పష్టం చేశారు వైవీ సుబ్బారెడ్డి.

ఇప్పటికీ 35 నియోజకవర్గాల్లో మార్పులు, చేర్పులు చేశాం.. అందరినీ సమన్యాయం చేసేందుకే జగన్ కృషి చేస్తున్నారు. ఆయన ఎలా ఆదేశిస్తే అలా పనిచేస్తాం అన్నారు వైవీ సుబ్బారెడ్డి.

టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్ని యాత్రలు చేసినా, డ్రామాలు వేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదని మండిపడ్డారు. 2019 ఎన్నికల సమయంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్.. ఒకరిపై ఒకరు ఎన్ని ఆరోపణలు చేసుకున్నారో అందరూ చూశారన్న ఆయన.. చంద్రబాబు హయాంలో ఒక్క హామీని కూడా అమలు చేయకుండా పాలన చేశారని ఆరోపించారు. కానీ, మేం అధికారంలోకి వచ్చిన మొదటి రోజు ఇచ్చిన హామీలు నెరవేర్చాం అన్నారు. కరోనా సమయంలో కూడా ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూశాం.. సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పధకాల వల్లే 175 నియోజకవర్గాల్లో గెలుస్తామని భరోసాగా ఉన్నాం అన్నారు. సోషల్ మీడియాలో వచ్చే వార్తలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు.

ఇక నేను ప్రత్యక్ష రాజకీయాల్లోనే ఉన్నా.. పార్టీ అప్పగించిన భాధ్యతలు కూడా చేస్తూనే ఉన్నాని గుర్తుచేశారాయన. మొత్తంగా రానున్న ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ సీపీ విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు వైవీ సుబ్బారెడ్డి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ఇంగ్లాడ్ కు బజ్ బాల్ టెస్ట్

క్రికెట్ టెస్ట్ మ్యాచ్ ఫార్మాట్ కు బజ్ బాల్ సాంప్రదాయాన్ని పరిచయం...

ఐపీఎల్ కు రిషబ్ రెడీ

2022లో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ టీం ఇండియా వికెట్ కీపర్...

మరోసారి తండ్రి అయిన విరాట్

టీ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి మరో సారి తండ్రి...

ప్రొ కబడ్డీ సీజన్-10లో ముగిసిన తెలుగు టైటాన్ ప్రస్థానం..

ప్రొ కబడ్డీ సీజన్-10లో తెలుగు టైటాన్స్ ప్రస్థానం ముగిసింది. టోర్నీ ఆధ్యాంతం...