DOT NEWS

ఉపముఖ్యమంత్రిగా ఉదయనిధి స్టాలిన్!?

Date:

తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తోంది. తమిళనాడు సీఎం స్టాలిన్ గారాల కుమారుడు ఉదయనిధి స్టాలిన్ ఈ చర్చకు కేంద్ర బిందువుగా మారారు. అసలు విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

డీఎంకే నేత, క్రీడా శాఖా మంత్రి ఉదయనిధి స్టాలిన్ ను తమిళనాడు ఉపముఖ్యమంత్రిగా చేయనున్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఫిబ్రవరిలో స్టాలిన్ విదేశీ పర్యటనకు వెళ్లే క్రమంలో ఉదయనిధిని డిప్యూటీ సీఎం హోదాలో ఉంచనున్నారని డీఎంకే వర్గాలు తెలిపాయి. జనవరి 21న సేలంలో జరగనున్న పార్టీ యూత్ వింగ్ సమావేశం తర్వాత దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఉదయనిధిని డిప్యూటీ సీఎంగా చేసేది ముఖ్యమంత్రి మాత్రమేనని డీఎంకే ఆర్గనైజేషనల్ సెక్రటరీ ఎళంగోవన్ అన్నారు. ఉదయనిధిని డిప్యూటీ సీఎంగా చేయనున్నారనే విషయం తనకు తెలియదని చెప్పారు. అయినప్పటికీ ఉదయనిధి పార్టీలో చాలా చురుకుగా ఉంటారు.. డిప్యూటీ సీఎం హోదా ఇవ్వడంలో ఎలాంటి తప్పులేదని చెప్పారు. ఈ అంశంపై ఉదయనిధిని ప్రశ్నించగా.. ఆయన పుకారుగా పేర్కొన్నారు.

ఉదయనిధిని ఉపముఖ్యమంత్రిగా చేస్తున్నారనే వార్తలపై అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం (ఏఐఏడీఎంకే) విమర్శించింది. ఉదయనిధికి ఎన్నికల్లో టికెట్ ఇచ్చారు.. ఆ తర్వాత మంత్రిగా అవకాశం ఇచ్చారు. ఇప్పుడు ఏకంగా ఉపముఖ్యమంత్రిగా ఎన్నుకుంటారు.
2026లో ఉదయనిధిని ముఖ్యమంత్రిని కూడా చేయాలనుకుంటారు. డీఎంకేలో పరివార్ వాదానికే ప్రాధాన్యం ఉందని, ప్రజాస్వామ్యం లేదని ఏఐఏడీఎంకే నేతలు విమర్శించారు. దీనికి సంబంధించి పూర్తి నిజా నిజాలు తెలియాలంటే.. కొంతకాలం వేచి చూడాల్సిందే!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ఇంగ్లాడ్ కు బజ్ బాల్ టెస్ట్

క్రికెట్ టెస్ట్ మ్యాచ్ ఫార్మాట్ కు బజ్ బాల్ సాంప్రదాయాన్ని పరిచయం...

ఐపీఎల్ కు రిషబ్ రెడీ

2022లో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ టీం ఇండియా వికెట్ కీపర్...

మరోసారి తండ్రి అయిన విరాట్

టీ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి మరో సారి తండ్రి...

ప్రొ కబడ్డీ సీజన్-10లో ముగిసిన తెలుగు టైటాన్ ప్రస్థానం..

ప్రొ కబడ్డీ సీజన్-10లో తెలుగు టైటాన్స్ ప్రస్థానం ముగిసింది. టోర్నీ ఆధ్యాంతం...