DOT NEWS

విజయవాడలో కల్యాణ్‌కు ఘన స్వాగతం

Date:

ఏపీ డిప్యూటీ సీఎం, మంత్రి పవన్‌ కల్యాణ్‌ విజయవాడకు చేరుకున్నారు. హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక విమానంలో వచ్చిన జనసేన అధినేతకు గన్నవరం విమానాశ్ర‌యంలో ఆ పార్టీ నాయకులు, కార్య‌క‌ర్త‌లు ఘన స్వాగతం పలికారు. అనంతరం జ‌న‌సేనాని రోడ్డు మార్గంలో మంగళగిరి పార్టీ కార్యాలయానికి బయలుదేరారు. 

ఇక పవన్‌ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత మొదటిసారి సచివాలయానికి వెళ్తున్నారు. రెండో బ్లాక్‌లోని తన ఛాంబర్‌ను పరిశీలించనున్నారు. మంత్రిగా బుధవారం ఛాంబర్‌లో బాధ్యతలు తీసుకోనున్నారు. కాగా, స‌చివాల‌యంలో త‌న ఛాంబ‌ర్‌ను ప‌రిశీలించిన అనంత‌రం సీఎం చంద్రబాబును ఆయన మర్యాదపూర్వకంగా కలిసే అవకాశం ఉందని స‌మాచారం.

కాగా, ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు సోమ‌వారం ఛాంబ‌ర్ కేటాయించారు. రెండో బ్లాక్‌లోని మొద‌టి అంత‌స్తులో 212 గ‌దిని కేటాయించ‌డం జ‌రిగింది. ఇక చంద్రబాబు మంత్రివర్గంలో పవన్ కల్యాణ్‌కు డిప్యూటీ సీఎం పదవితో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను కేటాయించిన విష‌యం విదిత‌మే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ఇంగ్లాడ్ కు బజ్ బాల్ టెస్ట్

క్రికెట్ టెస్ట్ మ్యాచ్ ఫార్మాట్ కు బజ్ బాల్ సాంప్రదాయాన్ని పరిచయం...

ఐపీఎల్ కు రిషబ్ రెడీ

2022లో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ టీం ఇండియా వికెట్ కీపర్...

మరోసారి తండ్రి అయిన విరాట్

టీ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి మరో సారి తండ్రి...

ప్రొ కబడ్డీ సీజన్-10లో ముగిసిన తెలుగు టైటాన్ ప్రస్థానం..

ప్రొ కబడ్డీ సీజన్-10లో తెలుగు టైటాన్స్ ప్రస్థానం ముగిసింది. టోర్నీ ఆధ్యాంతం...