DOT NEWS

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా #BSS12 ఫస్ట్ లుక్ రీలీజ్ చేసిన మూవీ మేకర్స్

Date:

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా లూధీర్ బైరెడ్డి, మహేష్ చందు, శివన్ రామకృష్ణ, మూన్‌షైన్ పిక్చర్స్ పాన్ ఇండియా ఫిల్మ్ #BSS12 నుంచి అడ్వంచర్ క్యారెక్టర్ పోస్టర్ రిలీజ్

యాక్షన్-హల్క్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ #BSS12 35% షూటింగ్ పూర్తి చేసుకుంది. డెబ్యుటెంట్ లుధీర్ బైరెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మూన్‌షైన్ పిక్చర్స్ బ్యానర్‌పై మహేష్ చందు నిర్మిస్తున్నారు. శివన్ రామకృష్ణ సమర్పిస్తున్న #BSS12 బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కెరీర్ లో హయ్యస్ట్ బడ్జెట్‌ మూవీ.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ అతని క్యారెక్టర్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు, అతన్ని అడ్వంచర్ అవతార్‌లో ప్రెజెంట్ చేశారు. రెండు కాళ్లను సీటుపై పెట్టుకుని బైక్‌ను నడుపుతూ ధైర్యంగా దూసుకెలుతున్న లుక్ అదిరిపోయింది. బ్యాక్ గ్రౌండ్ మూమెంట్ ఇంటెన్సిటీ పెంచింది. ఒక విశాలమైన లోయ, అతని వెనుక ఒక కొండపై విష్ణువు నామాలు కనిపించడం అద్భుతంగా వుంది. ఈ పవర్ ఫుల్ విజువల్ డేంజర్, అడ్వంచర్, డివైన్ ఎనర్జీని ప్రజెంట్ చేస్తోంది. బెల్లంకొండ అడ్వంచర్ స్టంట్స్ ఇంటెన్స్ యాక్షన్‌లతో కూడిన పాత్రను పోషిస్తున్నందున ప్రేక్షకులు మరపురాని సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ని ఆశించవచ్చు.

ఈ ఒకల్ట్ థ్రిల్లర్ 400 ఏళ్ల నాటి దశావతార ఆలయం నేపధ్యంలో వుంటుంది, ఇందులో సంయుక్త ఫీమేల్ లీడ్ గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. శివేంద్ర సినిమాటోగ్రాఫర్, లియోన్ జేమ్స్ సంగీతం, కార్తీక శ్రీనివాస్ ఆర్ ఎడిటర్, శ్రీనాగేంద్ర తంగాల ఆర్ట్ డైరెక్టర్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

అల్లు అర్జున్‌ కు రెగ్యులర్‌ బెయిల్‌

సంధ్యా థియేటర్‌ తొక్కిసలాట ఘటనలో హీరో అల్లు అర్జున్‌ కు ఊరట...

టీజర్ తో పిచ్చెక్కించిన కన్నడ హీరో గోల్డెన్ స్టార్ గణేష్..

గోల్డెన్ స్టార్ గణేష్ అప్ కమింగ్ మూవీ 'పినాక' మోస్ట్ అవైటెడ్...

అదరగొడుతున్న బాలయ్య ‘దబిడి దిబిడి’ సాంగ్

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ కథనాయకుడిగా నటించిన సినిమా విడుదలవుతుందంటే...