ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబుకి పరిపాలనలో స్పష్టమైన తేడా కనిపిస్తోంది. ప్రధాని మోదీ ఎక్కువ మాట్లాడరు. ఏదైనా వుంటే, పని చేసిన తర్వాతే నోరు తెరుస్తుంటారు. కానీ చంద్రబాబునాయుడి చేతలు తక్కువ, మాటలెక్కువ అనే విమర్శ వుంది. అందుకే మోదీ సర్కార్ వరుసగా మూడోసారి కూడా కేంద్రంలో కొలువుదీరింది. ఎన్నికల ప్రచారంలో మోదీ రైతులకు ఫలానా మేలు చేస్తానని ప్రత్యేకంగా ఆశ పెట్టలేదు. కానీ ఇంతకాలం ఏడాదికి ఇస్తున్న 6 వేలను 10 వేలకు పెంచి, రైతుల ఆదరణ చూరగొన్నారు. ఇక్కడే చంద్రబాబు ప్రధానంగా విమర్శలు ఎదుర్కొంటున్నారు.
ఎన్నికల సమయంలో చంద్రబాబు అన్నదాత సుఖీభవ కింద ఏడాదికి 20 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి ఆరు నెలలు దాటింది. ఇంత వరకూ ఆ పథకం అతీగతీ లేదు. కానీ మోదీ హామీ ఇవ్వకుండానే రైతులకు పెట్టుబడి సాయాన్ని పెంచి ఇవ్వడానికి నిర్ణయించారు. చంద్రబాబు మాత్రం రాజకీయంగా పబ్బం గడుపుకుని, తమ నోట్లో మట్టి కొడుతున్నారనే విమర్శను రైతాంగం నుంచి ఎదుర్కోవాల్సి వస్తోంది. ప్రధాని మోదీ ఎందుకు ప్రజల ఆదరణ పొందుతున్నారంటే, చెప్పకుండానే సాయం చేస్తున్నారు. విపరీతమైన హామీలిచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు మాదిరిగా చేసి వుంటే …మోదీ కూడా అభాసుపాలయ్యేవారు.మొత్తంగా చూస్తే.. మోదీ పాలన గమనిస్తే, చాలా కీలక అంశాలు కూడా హామీ ఇవ్వకుండానే చేసి ప్రజాదరణ పొందారు. చంద్రబాబుకు మోదీ మాదిరిగా ఎక్కువ కాలం పదవిలో ఉండాలనే ఆశ వుంది. కానీ అందుకు తగ్గట్టు పాలించాలనే కీలక అంశాన్ని బాబు మరిచిపోతుంటారు. కేవలం ఆశ మాత్రమే ఉంటే సరిపోదు, ప్రజల ఆదరణ పొందాలంటే ఇచ్చిన హామీలు నెరవేర్చలని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఏదేమైనా కూటమి ప్రభుత్వం హామీలు ఇస్తే సరిపోదని వాటిని నెరవేర్చితేనే ప్రధాని మోదీలా ఎక్కువ కాలం అధికారంలో ఉంటారని టాక్ వినిపిస్తుంది. ఇక ఏ మేరకు చంద్రబాబు మోదీని ఫాలో అవుతారో చూడాలి మరి.
మళ్లీ జగనే సీఎం..!!
Date: