క్రికెట్ టెస్ట్ మ్యాచ్ ఫార్మాట్ కు బజ్ బాల్ సాంప్రదాయాన్ని పరిచయం చేస్తూ..ఈ ఫార్మాట్ రూపు రేఖలే మార్చింది ఇంగ్లాండ్ క్రికెట్ టీం. దూకుడుగా ఆడి ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడి పెంచడం, అనూహ్యంగా ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేస్తూ ఆపోజిట్ టీం కు అందని వ్యూహాలు రచించే కొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టింది. కొన్ని సార్లు ఈ వ్యూహం బెడిసికొట్టిన ఏ మాత్రం వెన్నక్కి తగ్గకుంగా దూసుకుపోతోంది ఇంగ్లీష్ టీం. ముఖ్యంగా కోచ్ గా మెక్ కలమ్ బాధ్యతలు చేపట్టకా టీం ఆట స్వరూపానే మార్చేశాడు.
తాజాగా అదే వ్యూహంతో భారత్ పర్యటనకు వచ్చిన ఇంగ్లాడ్ కు ఇక్కడ ఆ వ్యూహాలు బెడిసికొడుతున్నాయి. హైదరాబాద్ వేదికగా జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ లో విజయం సాధించినప్పటికీ ఆ తరువాతి రెండు మ్యాచ్ లలో పర్యాటక జట్టు తీవ్రంగా దెబ్బతింది. టీ ఇండియా నయా సంచలనం యశస్వి జై స్వాల్ ముందు ఆ టీం ఆటలు సాగలేదు. వరుసగా రెండు డబులు సెంచిరీలు నమోదు చేసిన నయా సంచలనం పర్యాటక జట్టుకు నిజమైన బజ్ బాల్ ఆట ఎలా ఉంటుందో రుచి చూపించాడు. వరుస బౌండరీలతో రెచ్చిపోతూ తర్వాత మ్యాచ్ లకు ప్రత్యర్థి టీం కు గట్టి హెచ్చరికలు పంపాడు. ముఖ్యంగా ౩ మ్యాచ్ లో ఇంగ్లాడ్ 400పై చిలుకు పరుగుల తేడాతో ఓడిపోవడం ఇంగ్లాడ్ పై ఇంటా బయట తీవ్ర విమర్శలకు తావిస్తోంది. అయినప్పటికీ ఇంగ్లాండ్ ఏ మాత్రం తగ్గేదే లే అంటుంది.
ముఖ్యంగా ఇంగ్లాండ్ కీ ప్లేయర్ జో రూట్ ఆటపై రోజు రోజుకు విమర్శల దాడి పెరుగుతోంది. రూట్ సహజంగానే వేగంగా పరుగులు సాధించడంలో దిట్ట. అయితే తాజా సిరీస్ లో మాత్రం తీవ్రంగా నిరాశపరుస్తున్నాడు. బజ్ బాల్ మాయలో పడి త్వరగా వికెట్ సమర్పించుకుంటున్నాడని మాజీలు తీవ్రంగా తప్పు బడుతున్నారు. కెప్టెన్ బెన్ స్టోక్స్ ప్రదర్శన కూడా అంతత మాత్రంగానే ఉండటంతో విమర్శల వర్షం పెరుగుతోంది.
తాజా పరిస్థితుల నేపథ్యంలో తర్వాతి రెండు మ్యాచలలో ఇంగ్లాడ్ ఎలాంటి ప్రదర్శన ఇస్తుందో అన్న చర్చ సర్వత్రా ఆసక్తిని రేపుతోంది.