ఐపీఎల్ కు ఇండియాలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సమ్మర్ లో కోట్ల మంది భారతీయులను ఉర్రూతలూగిస్తూ వినోదాన్ని పంచడంలో ఐపీఎల్ ఎప్పుడు ముందుంటుంది. ప్రతి క్షణానికి మారే సమీకరణాలతో సగటు క్రీడా ప్రేక్షకుడిని టీవీల ముందు అతుక్కుపోయేలా చేస్తోంది.
తాజాగా ఐపీఎల్ 17వ సీజన్ పై లీగ్ ఛైర్మన్ అరుణ్ ధూమల్ కీలక ప్రకటన చేశాడు. మార్చి 22 నుంచి భారత్ లోనే ఈ క్రీడా సంబరాన్ని నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. త్వరలోనే దేశ సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తాము ప్రభుత్వ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. ముందుగా తొలి 15 రోజుల షెడ్యూల్ ను ప్రకటించి ఆ తర్వాత పరిస్థితలను బట్టి మిగతా షెడ్యూల్ ను ఖరారు చేస్తామన్నారు. దీంతో ఐపీఎల్ అభిమానులు పుల్ ఖుషీ అవుతున్నారు. కాగా ఈ ఐపీఎల్ లో ఆసీస్ ప్రధాన ఆటగాళ్లు మిచెల్ స్టార్క్ రూ.24.75, పాట్ కమిన్సన్ రూ.20.50 కోట్లకు అమ్ముడుపోయిన సంగతి తెలిసిందే.