DOT NEWS

న్యూ ఇయర్ కి మందుబాబులు తాగుడులో తగ్గితేలే … ఏపీకి కోట్ల ఆదాయం కురిపించెలే!

Date:

మందుబాబులు ఏడాది న్యూ ఇయర్ కి సందర్భంగా బీభత్సం మద్యం సేవించారు, రాష్ట్రానికి ఆదాయం కోట్ల రూపాయల కురిపించారు. గడిచిన రెండు రోజుల్లో మందుబాబుల హవా మామూలుగా లేదు.

కొత్త సంవత్సరం ఉమ్మడి కర్నూలు జిల్లాలో డిసెంబర్ 31, కొత్త ఏడాది జనవరి 1వ తేదీలలో యువతను ఉరుతలు ఊగించారు. 2023 పాత తరానికి చీర్స్ పలికి 2024 కొత్త లోకంలో అడుగు పెట్టాలని భావించిన యువతలో చాల వరకు మద్యం మత్తులో మునిగి తేలారు. యువత ఆనందం ముందు ఉమ్మడి జిల్లా ఆర్థిక వ్యవస్థలు జోరుగా కనిపించాయి. ముఖ్యంగా ఉమ్మడి జిల్లాల్లో కొత్త సంవత్సరం వేడుకల్లో మద్యం ఏరులై పారింది. చీర్స్ తో.. యువత న్యూ ఇయర్ 2024 కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ యువత ఆనందంకు తాగినట్లుగా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు జిల్లాల్లో మద్యం విక్రయాలను చేయడం గమనార్హం.

అయితే మద్యం విక్రయాల విషయంలో 2022తో పోలిస్తే ఎక్కువే. 2022లో మద్యం విక్రయాలతో రూ.8 కోట్ల వరకు ప్రోవిజన్ అండ్ ఎక్సైజ్ శాఖకు అదాయం సమకూరగా, 2023లో మరింత రెట్టింపు కావడం విశేషం. ఇందుకు కారణం లేకపోలేదు. ఈ సారి డిసెంబర్ 31 ఆదివారం రావడం ఒకటైతే, మద్యం అమ్మకాలకు రాత్రి 1 గంట వరకు గడువు ఇవ్వడం వంటివి మద్యం విక్రయాలపై ప్రభావం చూపాయి.
వీటికి తోడు మద్యం విక్రయ సమయాన్ని ప్రభుత్వం పెంచడం కూడా మద్యం ఆదాయంపై ప్రభావం చూపాయి. ఇక బార్లకు 1 గంట అనుమతించింది. దీంతో మద్యం విక్రయాల్లో కొంత అధికం కనిపించింది. మొత్తం ఒక్క డిసెంబర్ 30,31వ తేదీలలోనే కర్నూలు జిల్లాల్లో బార్లు మినహాయించి రూ. 7 కోట్ల వరకు మద్యం విక్రయాలు జరిగినట్లు అధికారుల లెక్కలను బట్టి వెల్లడవుతుంది.

ఇక నంద్యాల జిల్లాలో దాదాపు రూ. 4 కోట్ల వరకు అమ్మకాలు జరిగాయి. మొత్తంగా ఒక్క డిసెంబర్ లోనే కర్నూలు జిల్లాలొ 2022లో రూ.633,448566 కోట్ల ఆదాయం రాగా, ఇదే 2023 డిసెంబర్ లో రూ.630750769 కోట్లగా నమోదైంది. అంటే డిసెంబర్లో మద్యం విక్రయాలు 2 శాతం తగ్గడం గమనార్హం. ఇక డిసెంబర్‌లో మద్యం విక్రయాలను పరిశీలిస్తే.. 2022లో ఐఎంఎల్ 67701 కేసులను విక్రయించగా, ఇదే బీర్ల విషయానికి వస్తే 2022లో 29808 కేసులను విక్రయించారు. ఇక 2023లో ఐఎంఎల్ 64594 కేసులను విక్రయించగా, 26389 బీర్ల కేసులను విక్రయించారు.

మొత్తానికి రాష్ట్రమంతా ఇంచుమించు ఇదే పరిస్థితి నెలకొంది. మందుబాబులు ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో మద్యం సేవించడం ఆశ్చర్యం కలిగించింది. ఫలితంగా రాష్ట్రానికి కోట్ల రూపాయల ఆదాయం ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ నుంచి లభించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

విజయవాడలో కల్యాణ్‌కు ఘన స్వాగతం

ఏపీ డిప్యూటీ సీఎం, మంత్రి పవన్‌ కల్యాణ్‌ విజయవాడకు చేరుకున్నారు. హైదరాబాద్‌...

ఇంగ్లాడ్ కు బజ్ బాల్ టెస్ట్

క్రికెట్ టెస్ట్ మ్యాచ్ ఫార్మాట్ కు బజ్ బాల్ సాంప్రదాయాన్ని పరిచయం...

ఐపీఎల్ కు రిషబ్ రెడీ

2022లో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ టీం ఇండియా వికెట్ కీపర్...

మరోసారి తండ్రి అయిన విరాట్

టీ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి మరో సారి తండ్రి...