జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సినిమాల్లో పెద్ద హీరో.. అయితే పొలిటికల్ కెరియర్ లో మాత్రం ఆయన ఓ పెద్ద కమెడియన్ అని ప్రత్యర్ధులు విమర్శలు గుప్పిస్తున్నారు. టీడీపీతో పొత్తు పెట్టుకోవడంతో పాటు ఎల్లో మీడియాను కూడా ఆయన నెత్తికెత్తుకున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది.
కాకినాడ ప్రాంతంలో ఆయన సుడిగాలి పర్యటన ఏదో చేసినట్టుగా ఎల్లో మీడియాలో ప్రశంసలు కురిపిస్తూ వార్త రాసుకొచ్చారు. శుక్రవారం రోజు అంతా కాకినాడ సిటీ నియోజకవర్గంపై సమీక్షించారని కూడా రాశారు. 20 వార్డులకు చెందిన క్షేత్రస్థాయి నాయకులతో సుదీర్ఘంగా చర్చించారని, కొన్ని వర్గాల మేధావులతో కూడా ఆయన చర్చించినట్లు వార్త రాశారు. వార్డు కమిటీలను కాకినాడలో ఇంతవరకు ఏర్పాటు చేయకపోవడంపై స్థానిక జనసేన నాయకులు పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు అనేది అసలు వార్త. హలో మీడియా మరో అడుగు ముందుకేసి మూడు రోజు శనివారం కూడా కాకినాడలో మిగిలిపోయిన వార్డులపై సమీక్ష చేయనున్నారు అనడం మరీ హాస్యస్పదం.
నిజానికి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన 10 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో… ఇప్పటికీ 175 నియోజకవర్గాలపై స్పష్టమైన అవగాహన లేదు. ఒక్క నియోజకవర్గంపై రెండు రోజుల పాటు సమ్మె చేస్తే.. మిగిలిన నియోజకవర్గాలు కవర్ చేయడం సాధ్యమయ్యే పని కాదు. ఇదేమని ఎవరైనా ప్రశ్నిస్తే.. ఉభయగోదావరి జిల్లాలో వైసీపీకి ఒక్క సీటు కూడా రాదని తెగ గొప్పలు చెబుతూ ఉంటారు. ఆ రెండు జిల్లాలు జనసేన సొంతం అన్నట్టు పవన్ కళ్యాణ్ అంటూ ఉంటారు.
ఒక్కో నియోజకవర్గానికి ఇంత సమయం తీసుకుంటే.. జనసేన నాయకులు లోలోన ఆందోళన చెందుతున్నారు. పవన్ కు ఇంకెప్పుడు రాజకీయాలపై అవగాహన వస్తుందో అంటూ లభూ దీపం అంటున్నారు. పవన్ కళ్యాణ్ ప్రవర్తన కొన్ని సందర్భాల్లో నవ్వు తెప్పిస్తుందనికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఆయన రాజకీయ లెక్కలేంటో.. ఎవరికి అంతుపట్టని ఆయన వ్యూహాల వల్ల ఏం చేయాలో అర్థం కాక, లబోదిబోమంటున్నారు జనసేన నేతలు.