మహిళల అని కూడా చూడకుండా మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేసి అబాసు పాలైన టిడిపి నేత బండారు సత్యనారాయణకు బెండు వంచింది సొంత పార్టీ టీడీపీ. ప్రస్తుతం ఆయన రాజకీయ భవితవ్యం అగమ్య గోచరంగా తయారైంది.
సీటు కోసం నోటికి పని చెప్పి… వయస్సును కూడా మరచిన బండారుకు రానున్న ఎన్నికల్లో పెందుర్తి నుంచి టికెట్ లేదంటూ ఆ పార్టీ అధినేత చంద్రబాబు బండారుకు తేల్చిచెప్పినట్టు సమాచారం. జనసేనతో పొత్తు నేపథ్యంలో ఈ సీటును ఆ పార్టీకి కేటాయించనున్నట్టు పార్టీ పెద్దలు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.
ఒకవేళ పోటీ చేయాలనుకుంటే మాడుగుల నియోజకవర్గం నుంచి అదృష్టాన్ని పరీక్షించుకోవాలని తేల్చిచెప్పినట్టు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
అయితే, మాడుగుల నుంచి బరిలోకి దిగేందుకు బండారు ససేమిరా అంటున్నారు.
పెందుర్తి టికెట్ కావాలంటూ అధిష్టానం వద్ద మార్కులు కొట్టేసేందుకు వయస్సును కూడా మరచి మంత్రి రోజాపై అవాకులు చెవాకులు పేలారు. అయినప్పటికీ బండారుకు గ్రీన్ సిగ్నల్ లభించలేదు. పైగా ఆయన వ్యాఖ్యలతో మరింతగా పరిస్థితి దిగజారిపోయిందంటూ సొంత పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు.
వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటే ఇక బండారు సత్యనారాయణమూర్తి రాజకీయ చాప్టర్ ముగిసిన అధ్యాయమేనని ఆయన వర్గీయులే వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తంగా సీటు కోసం నోటికోచ్చినట్టు పనిచెప్పి ఉన్న కొద్దిపాటి గౌరవాన్ని దిగజార్చుకున్నా ఫలితం లేకపోవడంతో తన సన్నిహితుల వద్ద పార్టీ అధినాయకత్వంపై మండిపడుతున్నట్టు తెలుస్తోంది. మంత్రి రోజాపై వ్యాఖ్యల తర్వాత బండారు రాజకీయ గ్రాఫ్ మరింత వేగంగా దిగజారిందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.