టీ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి మరో సారి తండ్రి అయ్యారు. ఈ నెల 15 న తన భార్య అనుష్క శర్మ పండండి మగ బిడ్డకు జన్మినిచ్చినట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అతడికి అకాయ్ అని పేరు పెట్టినట్లు విరాట్ దంపతులు వెల్లడించారు. అకాయ్ అంటే సంస్కృతంలో అమరుడు, చిరంజీవి అని అర్థం. టర్కీ భాషలో ప్రకాశిస్తున్న చంద్రుడు అన్న అర్థం కూడా ఉంది. వారు మాట్లాడుతూ.. ఫిబ్రవరి 15 మా జీవితాల్లో మరిచిపోని రోజు. వామికాకు తమ్ముడు పుట్టిన రోజు. ఈ సంతోషాన్ని మీ అందరితో పంచుకోవడం పట్ల తాము సంతోషంగా ఉన్నాం. మమ్మల్ని ఆశీర్వదించండి అని అన్నారు. కాగా 2017లో వివాహం చేసుకున్న విరాట-అనుష్క శర్మ దంపతులకు ఇప్పటికే కుమార్తె వామిక ఉన్న విషం తెలిసిందే. ఇటీవలె ప్రారంభమైన ఇంగ్లాడ్ తో టెస్ట్ సిరీస్ కు కోహ్లి వ్యక్తి గత కారణాలతో దూరమయ్యాడు.