రైతు రుణమాఫీ దిశగా జగన్ ప్రభుత్వం అడుగులు వేస్తుందా.. ఆనంటే అవుననే అంటున్నాయి తాజా రాజకీయ పరిస్థితులు.
ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీ.. ఎన్నికల సమర శంఖం పూరించింది… ఇప్పుడు తీసుకునే ప్రతీ నిర్ణయమూ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తీసుకుంటోంది. ఈ క్రమంలో రుణమాఫీ అంశం కీలకంగా మారింది. ఏపీలో రైతులు రుణమాఫీ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం. ఇవాళ 3 అప్‌డేట్స్ ఇచ్చింది. అవేంటంటే..
1.సమీక్షా సమావేశం:
ఇవాళ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో క్యాబినెట్ సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై కసరత్తు చేసారు.
- ఏపీ క్యాబినెట్ సమావేశం:
ఈ నెల 31న ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. ఈ మంత్రిమండలి మీటింగ్‌లో ఆంధ్రప్రదేశ్ రైతులకు రుణమాఫీ చేసే అంశంపై చర్చిస్తారు. రుణమాఫీ విధివిధానాలపై కేబినెట్‌లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే ఉద్యోగులకు కొత్త పీఆర్సీ వచ్చే లోపు ఐఆర్ ఇచ్చే యోచనపైనా చర్చించారు. ఇంకా డీఎస్సీ నోటిఫికేషన్, అసెంబ్లీ సమావేశాలు, జగనన్న కాలనీలపైనా చర్చ జరుగిందని తెలిసింది. అలాగే మహిళలకు ఉచిత బస్ ప్రయాణం పథకాన్ని కల్పించే అంశం పరిశీలనలో ఉన్నందువల్ల.. దానిపైనా చర్చిస్తారనే ప్రచారం జరుగుతోంది. రాజకీయ పరిస్థితిని బట్టీ ఉచిత ప్రయాణంపై నిర్ణయం తీసుకుంటారని టాక్ వస్తోంది. జిల్లా పర్యటనలు, ఎన్నికల కార్యచరణ ప్రణాళికపై మంత్రులతో చర్చిస్తారని తెలుస్తోంది.
3.అసెంబ్లీ సమావేశాలు: ఫిబ్రవరి 6 నుంచి అసెంబ్లీ సమావేశాలు పెట్టే అవకాశం ఉంది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నట్లు సమాచారం.
ఇది ఏమైనా ఈసారి 2024లో గెలుపే ధ్యేయంగా జగన్మోహన్ రెడ్డి పావులు కలుపుతున్నట్టుగా తెలుస్తోంది. అందుకే సిద్ధం పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నారు.