DOT NEWS

షర్మిలకు షాక్‌సొంతగూటికి ఆళ్ల..!

Date:

ఏపీ కాంగ్రెస్ పీసీసీ చీఫ్‌ షర్మిలకు గట్టి షాక్‌ తగిలింది. కొడుకు పెళ్లి సందడిలో ఉన్న ఆమెకు..ఆళ్ల రామకృష్ణారెడ్డి కోలుకోలేని పొలిటికల్‌ షాక్‌ ఇచ్చారు..షర్మిల కాంగ్రెస్‌లో చేరగానే..ఆర్కే మొట్టమొదట షర్మిల పంచన చేరారు..ఇప్పుడు మళ్లీ సొంతగూటికి రావడానికి మార్గం సుగమం చేసుకుంటున్నారు..ఇంతకీ ఆళ్ల ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు..తత్వం బోధపడిందా.. కాంగ్రెస్‌లో పునరుజ్జీవం కష్టమని.. జ్ఞానోదయం కలిగిందా..రాప్తాడు సిద్ధం సభను చూసి..పార్టీ మారి తప్పు చేశానని తెలుసుకున్నారా..అసలేం జరిగింది..


అప్పుడప్పుడూ తల్లులు పిల్లలకు కుంకుడు కాయలతో తలంటుతారు..మట్టి గిట్టి..చుండ్రు, గిండ్రు ఉంటే పోతుందని..మంచిదే.. అది ఆరోగ్యం కూడా..మరి పెద్దవాళ్లకు తలంటడం అంటే..చేసిన తప్పులకు మొట్టికాయలు వేయడం అన్నమాట..ఇది ఎక్కువగా రాజకీయాల్లోనే జరుగుతుంది..పార్టీలు మారే గోడమీద పిల్లి లాంటి నేతలకు వర్తిస్తుంది..అంతెందుకు..జగన్‌ ముఖ్యమంత్రి కాక ముందు నుంచీ ఆయన దగ్గరే ఉన్న మంగళగిరి నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి..కొద్ది రోజుల కిందట పార్టీ మారారు. ఏపీ సీఎం జగన్‌ చెల్లెలు షర్మిల పంచన చేరారు.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ వైసీపీ చేపట్టిన ఇంఛార్జ్ ల మార్పుల్లో టికెట్ కోల్పోయిన సీనియర్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తిరిగి సొంత పార్టీలోకి వచ్చేందుకు చూస్తున్నారు.అయితే, ఆయన వైసీపీ చేపట్టిన ఇన్ ఛార్జ్ ల మార్పుల్లో సీటు కోల్పోయారు. దీంతో అధికార పార్టీకి గుడ్ బై చెప్పి ఏపీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిల హాయంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. అంతే కాదు కాంగ్రెస్ లో చేరిన తొలి వైసీపీ ఎమ్మెల్యేగా కూడా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు.

ఇంత వరకూ అంతా బాగానే ఉంది.. కానీ, కాంగ్రెస్ లో చేరిన తర్వాత ఆళ్ల రామకృష్ణారెడ్డికి కష్టాలు స్టార్ట్ అయ్యాయి. అప్పటి వరకూ మంగళగిరి ఎమ్మెల్యేగా, అధికార పార్టీ నేతగా ఉన్న పలుకుబడి అంతా పోవడంతో పాటు సొంత నియోజకవర్గంలో ప్రోటోకాల్ దగ్గరి నుంచి అన్నీ వదిలి పెట్టాల్సిన పరిస్థితి ఆళ్లకు ఎదురైంది. దీంతో ఆయనతో పాటు ఉండి గెలిపించిన అనుచరులంతా ఆత్మరక్షణలో పడ్డారు. అంతే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై ఒత్తిడి పెంచారు. దీంతో గత రెండు రోజుల క్రితం వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డితో చర్చించారు. ఈ చర్చల్లో తిరిగి వైసీపీలోకి వచ్చేందుకు ఆళ్లకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. రాజ్యసభ ఎంపీ అయోధ్య రామిరెడ్డితో కలిసి సీఎం జగన్ ను ఆళ్ల రామకృష్ణారెడ్డి కలవనున్నారు.

అన్నీ అనుకున్నట్లు జరిగితే మంగళవారం సాయంత్రం లోగా ఈ మంగళగిరి నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీలో చేరే అవకాశం ఉంది. అయితే, ఇప్పటికే ఆర్కే స్ధానంలో వైసీపీ ఎంపిక చేసిన బీసీ అభ్యర్ధి గంజి చిరంజీవికి నియోజకవర్గంలో అంతగా ఆదరణ లేకపోవడంతో తిరిగి మంగళగిరి ఇంఛార్జ్ ను కూడా మార్చే అవకాశం కూడా ఉంది. అదే సమయంలో ఆర్కే కూడా వైసీపీలోకి తిరిగి వస్తే జగన్ రిస్క్ ఎందుకని తిరిగి ఆయనకే టికెట్ ఇచ్చినా ఆశ్చర్యం లేదు అని వైసీపీలో అనుకుంటున్నారు.అయితే..ఆళ్లకు రాప్తాడు సభ కళ్లు తెరిపించిందని..పార్టీ మారి తప్పు చేశాననే ఫీలింగ్‌ కలిగిందని..అందుకే..మళ్లీ సొంతగూటికి వస్తున్నారని పొలిటికల్‌ టాక్‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

విజయవాడలో కల్యాణ్‌కు ఘన స్వాగతం

ఏపీ డిప్యూటీ సీఎం, మంత్రి పవన్‌ కల్యాణ్‌ విజయవాడకు చేరుకున్నారు. హైదరాబాద్‌...

ఇంగ్లాడ్ కు బజ్ బాల్ టెస్ట్

క్రికెట్ టెస్ట్ మ్యాచ్ ఫార్మాట్ కు బజ్ బాల్ సాంప్రదాయాన్ని పరిచయం...

ఐపీఎల్ కు రిషబ్ రెడీ

2022లో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ టీం ఇండియా వికెట్ కీపర్...

మరోసారి తండ్రి అయిన విరాట్

టీ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి మరో సారి తండ్రి...