ఎన్టీయార్ కుమారుడు సినీ నటుడు నందమూరి బాలకృష్ణ తెలుగుదేశం పార్టీ పగ్గాలు అందుకోవాలి. కానీ టీడీపీలో ఆయన స్థానం అయితే ఒక మామూలు నాయకుడు మాత్రమే. యువగళం సభలో ఆయన్ని తీసుకుని వచ్చి మాట్లాడించారు.
బాలయ్య తనదైన ధోరణిలో మాట్లాడేశారు. జగన్ని హైదరాబాద్ వెళ్తే మాత్రం బోర్డర్ లోనే కాల్చి దొబ్బుతారు అంటూ తీవ్రాతి తీవ్రమైన వ్యాఖ్య చేశారు. జగన్ వంటి సీఎం మాకు వద్దు అని వారు అలా చేస్తారుట. ఇది నిజంగా సహించాల్సిన మాటేనా. అంతే కాదు ఎవరో లూయీస్ 16 అన్న ఫ్రాన్స్ రాజు గురించి చెప్పుకొచ్చారు.
ఆయన్ని బయటకు తీసి కాల్చి చంపారు అని మరో ఘాతుకమైన మాట వాడారు. జగన్ని అలాగే చేయాలని అంటున్నారు. ఉద్యమం రావాలని బాలయ్య గర్జిస్తున్నారు. ఈ అయిదేళ్ళలో ఎక్కడ చచ్చారు ఏముద్దరించారు అని ఇష్టం వచ్చిన మాటలతో తన గందరగోళ స్పీచ్ తో బాలయ్య దడ పుట్టించారు.
ఉచిత పధకాలు అంటూ ఎన్నికల వేళకు మళ్లీ మీ దగ్గరకు వస్తున్నారు, అసలు నమ్మవద్దు అని బాలయ్య అంటున్నారు. అయితే ఉచిత పధకాలు అన్నీ అదే స్టేజ్ మీద చంద్రబాబు వల్లె వేశారు. నమ్మవద్దు అంటున్నది తన బావనా లేక జగన్ నా అన్నది బాలయ్యే చెప్పాలని అంటున్నారు.
బాలయ్య చెబుతున్న ప్రకారం చూస్తే ఉచిత పధకాలు జగన్ అయిదేళ్ల పాటు సక్రమంగానే ఇస్తున్నారు. చంద్రబాబే బూటకపు హామీలు ఇస్తున్నారు. మరి వేదిక మీద చంద్రబాబు గత పాలన సాక్ష్యాలను పెట్టుకుని జగన్ మీద దారుణమైన భాషను మాట్లాడుతున్న బాలయ్యను చూసి ఏమనాలి అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
బాలయ్య స్పీచ్ ఏంటో ఆయన ఏంటో అర్ధం కారు అనడానికి ఇది మరో ఉదాహరణ అంటున్నారు. జగన్ ని సీఎం అని కూడా చూడకుండా కాల్చి దొబ్బుతారు అన్న తీవ్రమైన భాష వాడడం ఆయననే చెల్లింది అని అంటున్నారు.. విశేషం ఏమిటి అంటే బాలయ్య స్పీచ్ ని ఎవరూ సీరియస్ గా తీసుకోరు కాబట్టే ఆయన ఏమన్నా అలా సరిపోతోంది అని వైసీపీ నేతలు అంటున్నారు.