టీడీపీ, జనసేన పొత్తులో తేడా కొడుతోందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.. పొత్తు ధర్మం ప్రకారం..జనసేనకు 40 నుంచి 50 అసెంబ్లీ స్థానాలు ఇవ్వాలి..కనీసం 5 ఎంపీ స్థానాలు ఇవ్వాలి..కానీ బాబు వ్యూహం మరోలా ఉన్నట్లు తెలుస్తోంది.. బీజేపీతో కూడా చెలిమి చేయడానికి ప్రయత్నిస్తున్న చంద్రబాబు..కమలం పార్టీ అడిగినన్ని ఇవ్వాల్సిందే..ప్రస్తుత పరిస్థితుల్లో ఇస్తారు కూడా..అదే జరిగితే.. జనసేనకు కచ్చితంగా అన్యాయం జరిగినట్లే..
బీజేపీకి 20 అసెంబ్లీ సీట్లు ఇస్తే..జనసేనకు సీట్ల సంఖ్య తగ్గుతుంది.. ఫలితంగా 30 కంటే ఎక్కువ ఇవ్వలేకపోవచ్చు..అంతకంటే కూడా తగ్గొచ్చు..అదే జరిగితే..కాపు వర్గం ఓట్లు..టీడీపీ అభ్యర్థులకు అస్సలు పడవనేది ఒక అంచనా..తమకు ప్రాధాన్యం లేనప్పుడు తామెందుకు ఓటు వేయాలని..కాపు సామాజిక వర్గం వెనక్కు తగ్గొచ్చు..ఓటు ట్రాన్స్‌ఫర్ కాకపోవడం వల్ల..అది కూటమికి అంటే..టోటల్‌గా టీడీపీకే మైనస్ అవ్వొచ్చు..అదే జరిగితే..మళ్లీ చంద్రబాబు సీఎం పదవిపై ఆశలు వదులుకోవాల్సిందేనని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.
అలా కాకుండా.. బీజేపీకి, జనసేనకు కలిపి 50 అసెంబ్లీ స్థానాలు, 10 ఎంపీ స్థానాలు ఇస్తే కూడా ఫలితం ఆశాజనకంగా ఉండకపోవచ్చనది ఒక వర్గం అభిప్రాయం.. ఎందుకంటే..బాబును ఎరిగిన చాలా మంది సీనియర్ కాపు నేతలు..పవన్ కల్యాణ్‌ను హెచ్చరిస్తున్నారు..అయితే ఆయన మాత్రం దేనికీ రెస్పాండ్ అవ్వడం లేదు..పోనీ..జనసేనకు ప్రాధాన్యత ఇచ్చి..బీజేపీకి, పవన్‌కు మొత్తం 75 స్థానాలు ఇద్దామనుకున్నా..టీడీపీకి అది పెద్ద మైనస్ అవుతుంది..అందుకే..బాబు ఏమీ చేయలేక..ఎటూ పాలుపోక..ఢిల్లీ వెళ్లొచ్చాక నిర్ణయం తీసుకుందాములే అని అనుకుంటున్నారట..జగన్‌ను ఓడించాలంటే..ఆయన ఓటు బ్యాంకు చీల్చాలి..అది జరగాలంటే..చంద్రబాబు పొత్తు ధర్మం పాటించాలి.ప్రస్తుత పరిస్థితులు గమనిస్తుంటే..పొత్తు ధర్మానికి తూట్లు పొడిచేలా ఉన్నట్లు తెలుస్తోంది..మరి..ఇలాంటప్పుడు..ఓటు బదిలీ కష్టమే..మరి జనసేనానికి ఎందుకు బోధపడటం లేదోనని కాపు నేతలే మొత్తుకుంటున్నారు.