DOT NEWS

ఆ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లోనే.. ‘ డెవిల్ ‘ మూవీ స్ట్రీమింగ్!

Date:

విభిన్న కథలకు ప్రాధాన్యత ఇస్తూ కళ్యాణ్ రామ్ నటిస్తున్న కొత్త సినిమాలు అన్నీ హిట్ అవుతున్నాయి.. తాజాగా ఆయన హీరోగా నటించిన ‘డెవిల్’ చిత్రం థియేటర్లలో విడుదలయ్యే మొదటి షో నుండే పాజిటివ్ టాక్ అందుకుంటోంది.. ట్విట్టర్ లో ఆయన సినిమాపై ప్రశంసలు కురుస్తున్నాయి.. మొదటి షో తోనే దూసుకుపోతుందని చెప్పొచ్చు… దాంతో నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.. ఇక ఈ మూవీ ఇప్పుడే థియేటర్లలో విడుదలయినా.. ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకుల్లో డిస్కషన్స్ మొదలయ్యాయి.

‘డెవిల్’ మూవీ ఓటీటీ రైట్స్ గురించే కాదు.. శాటిలైట్ రైట్స్ గురించి కూడా రూమర్స్ వైరల్ అవుతున్నాయి.. ఈ సినిమా అన్ని రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుందని వార్తలు వినిపిస్తున్నాయి.. ఇకపోతే శాటిలైట్ రైట్స్ విషయానికొస్తే.. ఈటీవీ ‘డెవిల్’ రైట్స్ ను దక్కించుకుందని సమాచారం. ఈ మూవీ రైట్స్ ను దక్కించుకోవడానికి అమెజాన్ ప్రైమ్, ఈటీవీ ఎంత ఖర్చు పెట్టాయనే వివరాలు ఇంకా బయటికి రాలేదు. కానీ సినిమా విడుదలకు ముందే విపరీతమైన హైప్ సంపాదించుకోవడంతో కచ్చితంగా ఈ రైట్స్ కోసం సంస్థలు భారీగానే ఖర్చుపెట్టుంటాయని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు…

ప్రస్తుతం ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.. ‘బింబిసార’ తో బ్లాక్ బాస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న కళ్యాణ్ రామ్, సంయుక్త ఖాతాలో ఈ సినిమా కూడా హిట్ ను అందుకుంటుందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది.. ఎన్నో కాంట్రవర్సీల మధ్య ‘డెవిల్’ చిత్రం విడుదలయ్యింది.. మొత్తానికి కళ్యాణ్ రామ్ మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నట్లు చెప్తున్నారు సినీ క్రిటిక్స్ .. ఇక కలెక్షన్స్ ఎలా ఉంటాయో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చెయ్యాల్సిందే..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ఇంగ్లాడ్ కు బజ్ బాల్ టెస్ట్

క్రికెట్ టెస్ట్ మ్యాచ్ ఫార్మాట్ కు బజ్ బాల్ సాంప్రదాయాన్ని పరిచయం...

ఐపీఎల్ కు రిషబ్ రెడీ

2022లో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ టీం ఇండియా వికెట్ కీపర్...

మరోసారి తండ్రి అయిన విరాట్

టీ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి మరో సారి తండ్రి...

ప్రొ కబడ్డీ సీజన్-10లో ముగిసిన తెలుగు టైటాన్ ప్రస్థానం..

ప్రొ కబడ్డీ సీజన్-10లో తెలుగు టైటాన్స్ ప్రస్థానం ముగిసింది. టోర్నీ ఆధ్యాంతం...