DOT NEWS

‘గంటా’కు సొంత పార్టీ నుంచి నెగటివ్ సిగ్నల్!

Date:

విశాఖ జిల్లాలో టిడిపి కీలక నేత గంట శ్రీనివాసరావు పరిస్థితి అసెంబ్లీ టికెట్ విషయంలో అగమ్యగోచరంగా ఉంది. ఈసారి విశాఖ నుంచి టిక్కెట్ లభించే పరిస్థితి కనిపించట్లేదు. పార్టీ టికెట్ లు ఇవ్వడంలో కీలకంగా వ్యవహరించే నారా లోకేష్ టికెట్ల విషయంలో అస్సలు మొహమాట పడకూడదని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అయ్యన్న పాత్రుడు తన కుటుంబానికి రెండు టికెట్లు కావాలంటే నో అని చెప్పేసారని వార్తలు వినిపించాయి. తడవకు ఓ నియోజక వర్గం మారే అలవాటు వున్న గంటా శ్రీనివాస రావు పరిస్థితి కూడా కాస్త కష్టంగానే వున్నట్లు తెలుస్తోంది.

గంటా తన పోటీ జర్నీలో భాగంగా ఇప్పటి వరకు అనకాపల్లి నుంచి భీమిలి మీదుగా విశాఖ వచ్చారు. ఇప్పుడు చోడవరం వెళ్లాలని అనుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనికి ఇప్పటి వరకు పార్టీ నుంచి సానుకూల స్పందన రాలేదని తెలుస్తోంది. పైగా చిన్న నెగిటివ్ సూచనలు వచ్చాయనే గ్యాసిప్ లు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి, చోడవరం నుంచి పోటీ చేసే విషయమై, పార్టీ పెద్దల అభిప్రాయం, అనుమతి గంటా శ్రీనివాసరావు కోరినట్లు తెలుస్తోంది. దాన్ని బట్టి చోడవరం నియోజకవర్గంలో గ్రౌండ్ వర్క్ స్పీడప్ చేయవచ్చు అన్నది గంటా ప్లాన్. కానీ దానికి సరైన సమాధానం, సానుకూల స్పందన రాకపోగా, ‘చూదాం అది కాకుంటే చాలా ఆప్షన్లు వున్నాయి’ అనే విధమైన సమాధానం లోకేష్ నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ‘చాలా ఆప్షన్లు’ అనే దానికి చాలా అర్థాలు వున్నాయి. వేరే నియోజకవర్గాలు అనే అర్ధంతో పాటు, ఎమ్మెల్యే కాకుంటే ఎమ్మేల్సీ, లేదంటే మరొకటి అనే అర్థాలు కూడా వున్నాయి. దాంతో గంటాకు పక్కాగా టికెట్ వస్తుందా అనే డిస్కషన్లు పార్టీలో వినిపిస్తున్నాయి.
గత అయిదేళ్లలో గంటా రకరకాలుగా వుంటూ వచ్చారు. పార్టీ విషయంలో యాక్టివ్ లేకపోవడం అందులో ఒకటి. ఒకేసారి రాజీనామా చేసారు. అది కూడా పార్టీకి పెద్దగా నచ్చలేదని వార్తలు వినవచ్చాయి. గంటా విషయంలో విశాఖ పార్టీ జనాలు కాస్త అసంతృప్తిగానే వున్నారు. ఇవన్నీ కలిసి గంటాను టికెట్ కు దూరం చేస్తాయోమో అన్న అనుమానాలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. దీంతో తీవ్ర నిరాశ స్పృహలో ఉన్నారు గంట శ్రీనివాసరావు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

విజయవాడలో కల్యాణ్‌కు ఘన స్వాగతం

ఏపీ డిప్యూటీ సీఎం, మంత్రి పవన్‌ కల్యాణ్‌ విజయవాడకు చేరుకున్నారు. హైదరాబాద్‌...

ఇంగ్లాడ్ కు బజ్ బాల్ టెస్ట్

క్రికెట్ టెస్ట్ మ్యాచ్ ఫార్మాట్ కు బజ్ బాల్ సాంప్రదాయాన్ని పరిచయం...

ఐపీఎల్ కు రిషబ్ రెడీ

2022లో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ టీం ఇండియా వికెట్ కీపర్...

మరోసారి తండ్రి అయిన విరాట్

టీ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి మరో సారి తండ్రి...