తన అన్న, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి చెల్లి వైఎస్ షర్మిల ఇవాళ తాడేపల్లి వెళ్లనున్నారు. ఆమె కుమారుడు రాజారెడ్డి నిశ్చితార్ధంతో పాటు పెళ్లి వేడుకకు రావాలని అన్న జగన్, వదిన భారతిని ఆహ్వానించేందుకు షర్మిల బుధవారం విజయవాడ వెళ్లనున్నారు. రాజారెడ్డి, ప్రియా జంట ప్రేమ వివాహం చేసుకోనున్న సంగతి తెలిసిందే.
ఈ నెల 18న నిశ్చితార్ధం, ఫిబ్రవరి 17న వివాహ వేడుకలు జరగనున్నట్టు షర్మిల నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇడుపులపాయలోని తండ్రి సమాధి వద్దకు కుమారుడితో పాటు కాబోయే కోడలు ప్రియా, ఇరువురి కుటుంబ సభ్యులను షర్మిల తీసుకెళ్లారు. వివాహ పత్రికను తండ్రి వైఎస్సార్ సమాధి వద్ద ఉంచి, ప్రార్ధనలు జరిపించారు షర్మిల. అనంతరం మొదటి పత్రికను తన అన్న కుటుంబానికి అందజేయాలని షర్మిల అనుకోవడం, వాళ్లిద్దరి మధ్య అనుబంధాన్ని ప్రతిబింబిస్తోంది. ఇదిలా ఉంటే ఎల్లో మీడియా మాత్రం… అన్నాచెల్లెళ్లకు పోసగడం లేదని, పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోందని రకరకాలుగా వార్తలు వండి వారుస్తోంది. చూడాలి మరి వారిద్దరూ కలిశాక ప్రజలకు ఎలాంటి సందేశాన్ని ఇస్తారో..!