DOT NEWS

తెలుగు తమ్ములు-జనసైనికులు ఎంత కలిసిపోయారో..!!దే…వు…డా…!!

Date:

వాళ్లంతా 30 ఏళ్లకు పైగా సైకిల్‌ పార్టీని నమ్ముకున్నోళ్లు..ఏదో ఒక చిన్న పదవి వచ్చినా..పార్టీని నమ్ముకున్నందుకు..సేవ చేసినందుకు ప్రతిఫలం దక్కిందిలే అనుకుందామని ఎదురుచూశారు..ఇటు పవన్‌ కల్యాణ్‌ ఫ్యాన్స్‌ కూడా సేమ్‌ టు సేమ్‌.. ఎవరైనా నాలుగు రాళ్లు వెనకేసుకుందామనే అనుకుంటారు. అంతేకదా..అందులో నో డౌట్‌..ఈ లోగా చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌..నీకు నేను నాకు నువ్వు ఒకరికొకరం నువ్వునేను..అని కలిసిపోయారు..వీళ్ల కలయికతో..అటు తమ్ముళ్లు..ఇటు గ్లాస్‌ సైనికులు కూడా కలవాల్సిందే కదా..అందుకే..ఎంత బాగా కలిసిపోయారో..ప్రతి ఊర్లో వీళ్ల కలుపుగోలుతనం చూసి జనమే ఆశ్చర్యంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు.

బాబుగారేమో పవన్‌ను కలవడానికి వెళ్తే..ఇంత పెద్ద గులాబీ పూల బొకే తీసుకెళ్తారు..పవన్‌ కూడా అంతే..బొకేలు ఇచ్చిపుచ్చుకుంటారు. టీలు, కాఫీలు తాగుతారు. టిపనీలు చేస్తారు..పొత్తు గురించి వీరలెవెల్లో డిస్కషన్స్‌ చేసుకుంటారు. కానీ ఎటూ తేల్చరు..దాదాపు కొలిక్కి వచ్చినట్లేనని సన్నాయి నొక్కులు నొక్కుతారు. వీళ్లనే నమ్ముకున్న సెకండ్‌ లెవెల్‌, థర్డ్‌ లెవెల్‌ లీడర్స్‌, గ్రౌండ్‌ లెవెల్లో ఉన్న కేడర్‌ మాత్రం వీళ్లిద్దరూ ఏదో చేస్తారని..ఎదురుచూసి చూసి..మోసపోతున్నట్లు..వాళ్ల అధినేతల గురించి చెప్పుకోవడానికి మాటల్లేక..చేతులతో చెప్పుకుంటున్నారు..కర్రలతో మాట్లాడుకుంటున్నారు. ఇంతకన్నా అందంగా చెప్పుకోవడం తమకు రాదని ప్రూవ్‌ చేస్తున్నారు. మీరేమో పొత్తు పెట్టుకుంటారు. మేమేమో తన్నుకు చావాల్నా అంటూ అధినేతలపైనే తిట్టిపోస్తున్నారు.

పొత్తు పుణ్యాన ఏ నియోజకవర్గంలో ఎవరు నిలబడతారో..ఏ పార్టీ అభ్యర్థికి టిక్కెట్‌ కన్ఫామ్‌ చేస్తారో తెలియదు..ఇన్నేళ్లు పార్టీ కోసం పని చేసినందుకు ఈ ఎన్నికల్లోనైనా ఏదైనా చేస్తారేమో అనుకుంటే..పొత్తు ఫిటింగ్‌ పెట్టి కటింగ్‌లు చెబుతూ..కటీఫ్‌ అంటున్నారు. వాళ్లేమో హైదరాబాద్‌ ఢిల్లీ తిరుగుతూ అధికారంకోసం చేయకూడని ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. కానీ గ్రౌండ్‌ లెవెల్లో పార్టీకి ఓట్లు వేసి..వేయించి..పార్టీకోసమే బతుకుతున్న వాళ్లను మాత్రం గాలికొదిలేశారని జనసేన, టీడీపీ నేతలే చెబుతున్నారు. అందుకే ఎక్కడ చూసినా..ఈ పొత్తు గొడవలు రెండు పార్టీల మధ్య తారస్థాయికి చేరుకున్నాయి..వీటిని చూసైనా చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ ఏమైనా కొత్తగా ఆలోచిస్తారో లేదో..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ఇంగ్లాడ్ కు బజ్ బాల్ టెస్ట్

క్రికెట్ టెస్ట్ మ్యాచ్ ఫార్మాట్ కు బజ్ బాల్ సాంప్రదాయాన్ని పరిచయం...

ఐపీఎల్ కు రిషబ్ రెడీ

2022లో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ టీం ఇండియా వికెట్ కీపర్...

మరోసారి తండ్రి అయిన విరాట్

టీ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి మరో సారి తండ్రి...

ప్రొ కబడ్డీ సీజన్-10లో ముగిసిన తెలుగు టైటాన్ ప్రస్థానం..

ప్రొ కబడ్డీ సీజన్-10లో తెలుగు టైటాన్స్ ప్రస్థానం ముగిసింది. టోర్నీ ఆధ్యాంతం...