DOT NEWS

ప్రజలే స్టార్‌ క్యాంపెయినర్లు..జగన్

Date:

యస్‌..ప్రజలే నా స్టార్‌ క్యాంపెయినర్లు..వాళ్లే వైసీపీ యోధులు..ఎలెక్షన్స్‌ వారియర్స్‌ అని ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి చెబుతున్నారు. మొన్న భీమిలి, నిన్న దెందులూరు, ఇప్పుడు రాప్తాడులో జరిగిన సిద్ధం సభలతో జగన్‌ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు..అడుగడుగునా జనం సందోహం ఆయనకు నీరాజనాలు పడుతోంది.. మీరు చేస్తున్న యుద్ధానికి మేము కూడా తోడుంటామని సిద్ధం సభల సాక్షిగా జనం చెబుతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల శంఖారావాన్ని పూరించారు సీఎం వైఎస్‌ జగన్‌.. భీమిలి నియోజకవర్గంలోని సంగివలసలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించింది.. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి భారీగా తరలివచ్చాయి వైసీపీ శ్రేణులు.. సిద్ధం పేరుతో నిర్వహించిన ఈ సభా వేదిక నుంచి.. యుద్ధానికి నేను సిద్ధం.. మీరు సిద్ధమా? అంటూ ప్రశ్నించారు.. వారి నుంచి సిద్ధం అంటూ సమాధానాన్ని రాబట్టారు.. ఈ యుద్ధానికి నేను సిద్ధం.. మీరు సిద్ధమా?, ఒంటరి పోరాటానికి నేను సిద్ధం.. మీరు సిద్ధమా? దుష్ట చతుష్టయాన్ని, గజ దొంగల ముఠాని ఓడించడానికి నేడు సిద్ధం.. మీరు సిద్ధమా? అంటూ ప్రశ్నించి వారి స్పందన తీసుకున్నారు. ఇక, వచ్చే రెండు నెలలు మనకు యుద్ధమే.. ఈ రెండు నెలలు మీరు సైన్యంగా పని చేయాలి.. దుష్టచతుష్టయం సోషల్‌ మీడియాలో చేసే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి.. మన టార్గెట్‌ 175కు 175 అసెంబ్లీ, 25కు 25 ఎంపీ స్థానాలు గెలవడమే అని స్పష్టం చేశారు.

ఇక, ప్రతి పక్షాలకు ఓటేయడం అంటే దాని అర్ధం.. మాకు ఈ స్కీములు వద్దని, ఈ స్కీముల రద్దుకు ఆమోదం తెలిపినట్లేనని గ్రహించాలి.. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి.. మన సంక్షేమ ఫలాలు అందుకునే ప్రతీ వ్యక్తి మనకు స్టార్ క్యాంపెయినరే.. వాళ్లను మరికొంతమందికి చెప్పేలా ప్రోత్సహించాలని వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు సీఎం జగన్‌.. పొత్తు లేకపోతే పోటీ చేయడానికే అభ్యర్థులే లేని వీరంతా పెద్ద పెద్ద మాటలు చెబుతున్నారు.. వారి మాటలు వింటుంటే కొన్ని సామెతలు గుర్తుకువస్తున్నాయి.. ఓటి కుండకు మోత ఎక్కువ.. చేతగాని వాడికి మాటలు ఎక్కువ అనే సామెతలు గుర్తుకు వస్తున్నాయని ఎద్దేవా చేశారు. మన ప్రభుత్వం చేసిన మంచిని ప్రతీ ఇంటికి వెళ్లి చెప్పండి.. పేదల భవిష్యత్‌ మారాలంటే.. జగనే గెలవాలని చెప్పండి.. ప్రపంచంతో పోటీ పడేలా మీ పిల్లలు చదవాలంటే జగన్‌ రావాలని చెప్పండి.. ప్రతి నెలా ఒకటో తేదీన పెన్షన్‌ రావాలంటే.. జగన్‌ గెలవాలని చెప్పండి.. పేదలకు నాణ్యమైన వైద్యం అందాలంటే.. జగన్‌ సీఎం అవ్వాలని చెప్పండి.. మీ బిడ్డ నమ్ముకుంది దేవుడిని, మిమ్మల్ని మాత్రమే.. ప్రజలే.. నా స్టార్‌ క్యాంపెయినర్లు అని వ్యాఖ్యానించారు వైఎస్‌ జగన్‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

విజయవాడలో కల్యాణ్‌కు ఘన స్వాగతం

ఏపీ డిప్యూటీ సీఎం, మంత్రి పవన్‌ కల్యాణ్‌ విజయవాడకు చేరుకున్నారు. హైదరాబాద్‌...

ఇంగ్లాడ్ కు బజ్ బాల్ టెస్ట్

క్రికెట్ టెస్ట్ మ్యాచ్ ఫార్మాట్ కు బజ్ బాల్ సాంప్రదాయాన్ని పరిచయం...

ఐపీఎల్ కు రిషబ్ రెడీ

2022లో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ టీం ఇండియా వికెట్ కీపర్...

మరోసారి తండ్రి అయిన విరాట్

టీ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి మరో సారి తండ్రి...