రాప్తాడు రీ సౌండ్స్..ప్రతిపక్షాల తుప్పు రేపుతున్నాయి.. మూడో సిద్ధం సభతో రాయలసీమ దద్దరిల్లింది. లక్షలాది జనం వచ్చినట్లు కళ్లకు కనిపిస్తున్నా..ఒక వర్గం మీడియా మాత్రం విషం కక్కుతూనే ఉంది..రాప్తాడు సభతో జగన్ స్టామినా ఏంటో చూశాక..అటు ప్రత్యర్థులకు..ఇటు ఆ వర్గం మీడియాకు ఏం చేయాలో దిక్కుతోచడం లేదు. అందుకే..అటెన్షన్‌ను డైవర్ట్ చేయడానికి చేయకూడని ప్రయత్నాలు చేస్తోంది..
జనమే జగన్..జగనే జనం..అడుగడుగునా నీలి సంద్రాన్ని మించిన జన సంద్రం..రాప్తాడు సిద్ధం..రాయలసీమలో కదం తొక్కిన వైసీపీ బలగం..
అనంతపురం జిల్లా రాప్తాడు సభ ధుం ధాంగా సాగింది. లక్షలాది మంది జనం కదం తొక్కారు… సీఎం వైయస్ జగన్ పురిటిగడ్డ అయిన రాయలసీమతో ఆయనకు ఉన్న పట్టు ఎంత.. ఆ కటౌట్ కు అక్కడి ప్రజలు ఎంతగా నీరాజనాలు పట్టారు అనేదానికి రాప్తాడు సభ జస్ట్ శాంపిల్ మాత్రమే..ముందుంది..బ్యూటిఫుల్ పోలింగ్ ఫెస్టివల్..
భూమి ఆకాశం ఏకమైనట్లు … ఎటు చూసినా జనం… జగన్ ప్రసంగానికి చేతులు ఊపుతూ స్పందన.. అయన మాటలకూ అయన పంచ్ డైలాగులకు ప్రజలు ఉర్రూతలూగారు. సభ జరిగిన మైదానానికి అటు ఇటు కిలోమీటర్ల పొడుగునా ట్రాఫిక్ జామ్..
సభలో జగన్ మాట్లాడుతూ చంద్రబాబు నలభయ్యేళ్ల పాలనతోబాటు అయన వ్యక్తిత్వాన్ని కడిగిపారేశారు. ప్రజలను వంచించి నమ్మించి గెలిచాక చంద్రబాబు ఎలా మాట మారుస్తారన్నది ఎగ్జాంపుల్స్‌తో సహా ముఖ్యమంత్రి ప్రజలకు వివరించారు.
సిద్ధం సభల్లో జగన్ చేసిన ప్రసంగాలు మొత్తం రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ శ్రేణుల మూడ్ ను మార్చేశాయి. వారిని ఎన్నికల యుద్ధానికి సన్నద్ధం చేస్తూ జగన్ చేసిన ప్రసంగాలు అభిమానులు, క్యాడర్, నాయకులకు గొప్ప టానిక్ లా పని చేస్తున్నాయి. దీంతో వారు రెట్టించిన ఉత్సాహంతో ముందుకు ఉరుకుతున్నారు.
టీడీపీ చరిత్రలోనే ఇలాంటి సభ నిర్వహించలేదు… దీంతో జగన్ కు వస్తున్న ఆదరణను తక్కువ చేసి చూపేందుకు ప్రతిపక్షాలతో పాటు..ఓ వర్గం మీడియా నానా పాట్లు పడుతున్నాయి. జగన్ సభకు జనం రాలేదని ఒకసారి… భయపెట్టి తరలించారని ఇంకోసారి చెబుతూ ప్రజలను నమ్మించజూస్తున్నాయి. కానీ కళ్ల ముందు నిజాన్ని దాచలేరు..అరచేతిని అడ్డుపెట్టి సూర్యుడిని ఆపడం ఎలా అసాధ్యమో… జగన్ పట్ల ప్రజల్లో ఉన్న ఆదరణను మీడియా ద్వారా అడ్డుకోవడం అంతటి అసాధ్యం అని వైయస్సార్ కాంగ్రెస్ శ్రేణులు అంటున్నాయి. తెలుగుదేశం.. ఎల్లోమీడియా ఎంత తాపత్రయపడినా యాగాశ్వం మాదిరి దూసుకుపోతున్న తమ పార్టీని నిలువరించలేరని జగనన్న సైనికులు ఘంటాపథంగా చెబుతున్నారు. అందుకే జగన్ నేను సిద్ధం మీరు సిద్ధమా అంటూ జనం గుండెల్లో జోష్ నింపుతున్నారు.
ప్రతిపక్షాల గూబ గుయ్యిమనిపించిన రాప్తాడు రీ సౌండ్స్
Date: