DOT NEWS

లోపల విద్వేషం .. బయట మాత్రం స్వాగతం!

Date:

షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం కొంతమంది సీనియర్ కాంగ్రెస్ నాయకులకు ఏమాత్రం ఇష్టం లేదు. వారిలో ప్రధానంగా మాజీ ఎంపీ చింత మోహన్. అధిష్టానం నిర్ణయంతో చేసేది మీ లేక లోపల ఎంత విద్వేషమున్నా.. బయటకు మాత్రం స్వాగతించక తప్పని పరిస్థితి ఏర్పడింది.

తిరుపతి మాజీ ఎంపీ చింతా మోహన్ మొదటి నుంచి వైఎస్సార్ కు వ్యతిరేకంగా రాజకీయం చేస్తూ వచ్చారు. వైఎస్సార్ జీవించిన రోజుల్లో కూడా చింతా మోహన్ కేంద్ర పెద్దలతో సాన్నిహిత్యం ఉందని ఇష్టానుసారం వ్యవహరించేవారు. వైఎస్సార్ వ్యతిరేక వర్గంగా చింతా మోహన్ గుర్తింపు పొందారు. ఇప్పటికీ ఆయనకు వైఎస్ కుటుంబ సభ్యులంటే కోపం.

అందుకే కాంగ్రెస్లోకి షర్మిల రాకను వ్యతిరేకించారు. అయితే కాంగ్రెస్ పెద్దలు చింతా మోహను పట్టించుకోకపోవడంతో చేసేదేమీ లేక ఇప్పుడు జై కొడుతున్నారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ నేతల సమావేశంలో షర్మిల పార్టీలోకి వస్తున్నట్టు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్గాంధీ చెప్పారు. షర్మిల రాకపై అభిప్రాయాలేవైనా వుంటే చెప్పాలని కాంగ్రెస్ అగ్రనేతలు కోరారు.

వైఎస్సార్ కు గతంలో విపరీతమైన స్వేచ్ఛ ఇచ్చి నష్టపోయామని, సొంత ఇమేజ్ ను పెంచుకున్నారని చింతా మోహన్ ఆ సమావేశంలో చెప్పినట్టు తెలిసింది. వైఎస్సార్ తనయుడు జగన్ కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం చేశారని, అన్నలాగే చెల్లి షర్మిల కూడా నష్టం చేస్తుందని తన అభిప్రాయాన్ని అగ్రనేతలకు వివరించారు. చింతా మోహన్ తో పాటు అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ కూడా షర్మిల రాకను వ్యతిరేకించారు. అయితే వారి అభ్యంతరాలను పట్టించుకోకుండా, షర్మిల వైపే అగ్రనేతలు మొగ్గు చూపారు.

ఈ నేపథ్యంలో షర్మిల గురించి చింతా మోహన్ చేసిన కామెంట్స్ చర్చనీయాంశమయ్యాయి. చింతా మోహన్ మీడియాతో మాట్లాడుతూ షర్మిల రాకతో కాంగ్రెస్ పార్టీకి పునర్ వైభవం వస్తుందన్నారు. కాంగ్రెస్లో చేరేందుకు షర్మిల ఆరు నెలలుగా ప్రయత్నిస్తోందంటూ తన అక్కసును ఆయన వెళ్లగక్కారు. షర్మిల కాంగ్రెస్ లోకి రావాలని కోరుకోవడం వల్లే ఆమెను ఆహ్వానించామని ఆయన చెప్పుకొచ్చారు. షర్మిల పార్టీలోకి వచ్చిన తర్వాత ఆమె పదవి గురించి ఆలోచిస్తున్నామన్నారు.

వైఎస్సార్ కుటుంబ సభ్యులపై చింతా మోహన్ మరోసారి అక్కసు వెళ్లగక్కారు. కాంగ్రెస్ కు పునర్ వైభవం అంటూనే, ఆమె రావాలని అనుకుంది కాబట్టి ఆహ్వానించామనడం చులకన చేయడమే. షర్మిల పార్టీలోకి వస్తే, చింతా మోహన్ ఎలా వ్యవహరిస్తారో చూడాలి. కాంగ్రెస్ ను బాగా వాడుకున్న నాయకుల్లో చింతా మోహన్ ప్రప్రథముడని అంటుంటారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

విజయవాడలో కల్యాణ్‌కు ఘన స్వాగతం

ఏపీ డిప్యూటీ సీఎం, మంత్రి పవన్‌ కల్యాణ్‌ విజయవాడకు చేరుకున్నారు. హైదరాబాద్‌...

ఇంగ్లాడ్ కు బజ్ బాల్ టెస్ట్

క్రికెట్ టెస్ట్ మ్యాచ్ ఫార్మాట్ కు బజ్ బాల్ సాంప్రదాయాన్ని పరిచయం...

ఐపీఎల్ కు రిషబ్ రెడీ

2022లో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ టీం ఇండియా వికెట్ కీపర్...

మరోసారి తండ్రి అయిన విరాట్

టీ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి మరో సారి తండ్రి...