DOT NEWS

వైసీపీకి ముద్రగడ దూరం అవడానికి కారణం అదేనా?

Date:

కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మానాభం నిన్నటిదాకా వైఎస్ఆర్సిపి తో ఎంతో సఖ్యతగా అనుకూలంగా వ్యవహరించారు. కానీ రీసెంట్ గా వైసీపీతో పూర్తి వ్యతిరేకతను కనబరుస్తూ.. ఆ పార్టీతో తనకున్న అనుబంధాన్ని తెగ తెంపులు చేసుకున్నారు. ముద్రగడ సడన్ గా ఈ నిర్ణయం తీసుకోవడానికి అసలు కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

ముద్రగడ ప్రస్తుతానికి అయితే తెలుగుదశం, లేదా జనసేన పార్టీలో చేరే అవకాశం క్లియర్ గా కనిపిస్తోంది.. నిన్నటి నుంచి జరుగుతోన్న పరిణామాలు పొలిటికల్‌ హీట్‌ పెంచుతున్నాయి.. బుధవారం రోజు ముద్రగడతో జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్‌ చర్చలు జరిపితే.. ఈ రోజు టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ.. ముద్రగడతో సమావేశం అయ్యారు. ఇక, కలిసి పనిచేసేందుకు కూడా తాను సిద్ధంగా ఉన్నాననే సంకేతాలు కూడా ఇచ్చారు.

అంతేకాదు.. రెండు, మూడు రోజుల్లో పవన్‌ కల్యాణ్‌ సమక్షంలో జనసేన పార్టీలో చేరతారనే ప్రచారం కూడా సాగుతోన్న తరుణంలో.. ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
ముద్రగడ పద్మనాభం కుమారుడు గిరి బాబు.. టీడీపీ, జనసేన ఏ పార్టీలోకి అయినా వెళ్లే అవకాశం ఉందని క్లారిటీ ఇచ్చారు.

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి వెళ్లడానికి నాన్న ఇంట్రెస్ట్ చూపడం లేదన్నారు ముద్రగడ గిరిబాబు. నాన్న, నేను.. ఇద్దరం పోటీ చేయడానికి ఆసక్తిగానే ఉన్నాం, ఏదైనా పార్టీలో చేరిన తర్వాత నిర్ణయం ఉంటుందన్నారు. కాకినాడ పార్లమెంట్, ప్రత్తిపాడు, పిఠాపురంలో పోటీ చేయడానికి ఇంట్రెస్ట్ ఉందని తన మనసులో మాట బయటపెట్టిన ఆయన.. మరిన్ని చర్చలు జరుగుతాయన్నారు.

గతంలోనే చెప్పినట్టు ఈసారి కచ్చితంగా పోటీలో ఉంటాం.. త్వరలోనే నిర్ణయం ఉంటుందన్నారు. అన్నింటికి సిద్ధపడి గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నాం.. టీడీపీ లేదా జనసేనలో చేరడం.. పోటీ చేయడం ఖాయం అని మీడియా చిట్‌చాట్‌లో పేర్కొన్నారు ముద్రగడ గిరిబాబు.

అయితే ముద్రగడ పద్మనాభం ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం ఇటీవల ఆయన జగన్ అపాయింట్మెంట్ కోసం వేచి చూశారు.కాని సీఎం అపాయింట్మెంట్ దొరకలేదు. దీంతో ఆయన తీవ్రంగా హర్ట్ అయ్యారట. ఈ కారణం చేతనే ముద్రగడ వైసీపీకి దూరమయ్యారని తెలుస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

విజయవాడలో కల్యాణ్‌కు ఘన స్వాగతం

ఏపీ డిప్యూటీ సీఎం, మంత్రి పవన్‌ కల్యాణ్‌ విజయవాడకు చేరుకున్నారు. హైదరాబాద్‌...

ఇంగ్లాడ్ కు బజ్ బాల్ టెస్ట్

క్రికెట్ టెస్ట్ మ్యాచ్ ఫార్మాట్ కు బజ్ బాల్ సాంప్రదాయాన్ని పరిచయం...

ఐపీఎల్ కు రిషబ్ రెడీ

2022లో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ టీం ఇండియా వికెట్ కీపర్...

మరోసారి తండ్రి అయిన విరాట్

టీ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి మరో సారి తండ్రి...