తనకంటు ఓ ప్రత్యేక కామిడీ టైమింగ్ ను సెట్ చేసుకుని ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న నటుడు హర్ష చెముడు. తాజాగా ఆయన, దివ్య శ్రీ పాద హీరో హీరోయిన్లు గా చేస్తూ ప్రముఖ నటుడు రవితేజ నిర్మించిన చిత్రం సుందరం మాస్టార్. కళ్యాణ్ సంతోష్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ నెల 22 న థియేటర్లలో విడుదలవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక మంగళవారం హైదరావాద్ లో జరిగింది. కార్య క్రమానికి ముఖ్య అథిదిగా విచ్చేసిన డీజే టిల్లు హీరో సిద్దు జొన్నల గడ్డ మాట్లాడుతూ.. సినిమా ట్రైలర్ చాలా బాగుంది. యూత్ లో తనకంటు మంచి క్రేజ్ ను సంపాదించుకున్న నటుడు హర్ష. ఎంతో ప్రతిభ ఉన్న దర్శకుడు కళ్యాణ్ వీరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా మంచి విజయం సాధించాలన్నారు. ఎంతో బిజీగా ఉన్నప్పటికీ కొత్త టాలెంట్ ను ప్రోత్సహించడంలో రవితేజ ఎప్పుడు ముందుంటారు అన్నాడు. ట్రైలర్ లో హర్ష సహజంగా నటించాడన్నారు. ఈ సినిమా హర్షకు తప్పకుండా మంచి గుర్తింపును ఇస్తుందన్నారు. దర్శకుడు కళ్యాణ్ మాట్లాడుతూ.. తప్పకుండా మా సుందరం మాస్టార్ సినిమా ప్రేక్షకులను మెప్పిచడంతో పాటు చిత్ర యూనిట్ కు మంచి పేరును తెస్తుందన్నారు.