ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మూడు కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో మొత్తం 328 కేసులు నమోదైతే.. వాటిలో మూడు ఏపీ నుంచి ఉన్నట్లు కేంద్రం తెలిపింది. ఈ కేసులు పాత వేరియంట్‌వా లేక, కొత్త వేరియంట్‌వా అన్నది క్లారిటీ రావాల్సి ఉంది. ఈ కేసుల్లో.. ఏలూరులో ఒక కరోనా పాజిటివ్ నమోదయ్యింది. కొత్త వేరియంట్ అలర్ట్‌తో ఆరుగురికి ర్యాండమ్‌గా టెస్ట్‌లు చేయగా.. ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ వైద్యుడికి కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. వేరియంట్ నిర్ధారణ కోసం శ్వాబ్‌ను హైదరాబాద్ జినోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్‌కు పంపించారు. పాజిటివ్ వ్యక్తికి ఎలాంటి లక్షణాలు లేవని.. ఎవరూ కంగారుపడాల్సిన పపనిలేదన్నారు డీఎం అండ్ హెచ్‌వో. పాజిటివ్ వచ్చిన వ్యక్తి వేరే రాష్ట్రాలకు ఎక్కడికి వెళ్లి రాలేదన్నారు.
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో తొలి కోవిడ్ కేసు నమోదైనట్లు తెలుస్తోంది. 85 ఏళ్ళ మహిళకు కోవిడ్ సోకినట్టు సమాచారం. శాంపిల్‌ను జీనోమ్ సీక్వెన్స్ ల్యాబ్ పంపారు అధికారులు. ఈ రెండు కేసులు తేలితే.. మూడో కేసు ఎక్కడ అనేది క్లారిటీ రావాల్సి ఉంది. కరోనా కేసులు నమోదు కావడంతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా అప్రమత్తం అయ్యారు. ఇవాళ అధికారులతో రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితిపై సమీక్ష నిర్వహిస్తున్నారు. వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో రాష్ట్రంలో కొవిడ్ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తున్నారు. పండుగ సీజన్ కావడంతో వైరస్ కట్టడికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేశారు.
మరోవైపు ఏపీలో అధికారులు కూడా అప్రమత్తం అయ్యారు. ప్రస్తుతం ర్యాపిడ్ పరీక్షలు చేస్తున్నారు. అవసరమైన చోట్ల పడకల వార్డు ఏర్పాటు చేస్తున్నారు. కొవిడ్ లక్షణాలతో వచ్చేవారికి వెంటనే పరీక్షలు, చికిత్సకు వైద్యులతో ఓ టీమ్‌నుఏర్పాటు చేశారు. జలుబు, జ్వరం, దగ్గు, గొంతునొప్పి, న్యుమోనియా ఇబ్బందులున్నవారికి ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు.
వైద్యులు, సిబ్బంది, రోగులు మాస్కులు ధరించాలని అధికారులు ఆదేశాలిచ్చారు. భౌతిక దూరం, చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవడంపై రోగులకు అవగాహన కల్పించాలి నీ మరుగుదొడ్లు, ఇతర వార్డుల్లో పక్కాగా పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టాలి. మందులు, ఆక్సిజన్, వెంటిలేటర్లు, పరికరాలు, మాస్కులు, ఆర్టీపీసీఆర్ కిట్లు, కాన్సన్‌ట్రేటర్లు, సిలిండర్లు, ఐసీయూ పడకలు, పీపీఈ కిట్లను అందుబాటులో ఉంచాలన్నారు. అంతేకాదు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. మాస్కులు ధరించాలని సూచిస్తున్నారు.. అనుమానం ఉన్నవాళ్లు వెంటనే టెస్టులు చేయించుకోవాలని సూచిస్తున్నారు. అంతేకాదు కేరళలో కూడా కరోనా కేసుల సంఛ్య పెరుగుతోంది. ఈ క్రమంలో శబరిమల వెళ్లి వస్తున్న భక్తులకు కూడా టెస్టులు నిర్వహిస్తున్నారు.