ప్రశాంత్ కిషోర్ టీమ్ ఇప్పుడు లేదు. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ ఎన్నికల టీమ్ నిర్వహించే పని మానేసి, అంతకు మించిన పనులు పెట్టుకున్నారు. కానీ ఎవరిదన్నా టీమ్ వుంటే సలహాలు సూచనలు ఇస్తారు. దిశానిర్దేశం చేస్తారు. కానీ ఆయన డైరక్షన్ లో టీమ్ పని చేయాలన్నా, ఆయన స్టయిల్ లో వర్క్ చేయాలన్నా అంత వీజీ కాదు.
ఇది ఒక్క జగన్ కు మాత్రమే సాధ్యమైంది. ఎంత సాధ్యం అయింది అంటే గీత గీసి, దాని మీద నిల్చో అంటే నిల్చునేంత. అరి బ్రహ్మాదులు చెప్పినా ఇక మారేది లేదు. ప్రశాంత్ కిషోర్ టీమ్ ఏం చెబితే అదే రాజ్యాంగం,
జగన్ గెలుపు చూసి కేసీఆర్ కూడా ప్రశాంత్ కిషోర్ ను తన దగ్గరకు తీసుకున్నారు. కానీ చాలా తక్కువ కాలంలోనే భరించలేక వదిలేసారు. భరించలేక అంటే డబ్బుల సమస్య కాదు. నిర్ణయాల సమస్య. డే టు డే యాక్టివిటీ దగ్గర నుంచి ప్రతి విషయంలోనూ సలహాలు, సూచనలతో పాటు, డెసిషన్ మేకింగ్ కూడా ఆల్ మోస్ట్ ఆ టీమ్ దే. ఈ విషయం ఏమీ గ్యాసిప్ కాదు. కేటీఆర్ నే ఓపెన్ గా చెప్పారు. ప్రశాంత్ కిషోర్ టీమ్ ఎలా చెబితే అలా నడవడం సాధ్యం కాక వదిలేసాం అని ఓ ప్రసంగంలో ఇండైరెక్ట్ గా చెప్పుకువచ్చారు.
జగన్.. జగమొండి కనుక, ముందు వెనుకలు ఆలోచించకుండా ప్రశాంత్ కిషోర్ టీమ్ ను ఫాలో.. ఫాలో అన్నారు. ఇప్పటికీ ఆల్ మోస్ట్ అంటున్నారు. కానీ కేసీఆర్/కేటిఆర్ అలా చేయలేకపోయారు. కానీ మరి చంద్రబాబు పరిస్థితి ఏమిటి?
కేవలం బ్రాడ్ గా జస్ట్ పొలిటికల్ సలహాలు తీసుకోవడం వరకు ఓకె. పొలిటికల్ స్ట్రాటజీలు రచించడం వరకు ఓకె. కానీ గ్రౌండ్ లెవెల్ లో ప్రశాంత్ కిషోర్ గైడెన్స్ లో టీమ్ పని చేయడం, దాని సలహాల మేరకు నిర్ణయాలు తీసుకోవడం మాత్రం కష్టం. అది చంద్రబాబు పనితీరుకు నప్పేది కాదు. అందున్న ఏం చేస్తారు అన్నది కాస్త ఆసక్తికరం.
ప్రశాంత్ కిషోర్ గ్రౌండ్ లెవెల్ సలహాలు తీసుకుంటే ఓ సమస్య. తీసుకోకపోతే మరో సమస్య. అందువల్ల ప్రశాంత్ కిషోర్ రాగానే పండగ కాదు బాబు… ఇన్ ఫ్రంట్ క్రొకోడైల్ ఫెస్టివల్ అంటున్నారు విశ్లేషకులు.