DOT NEWS

ఈసారి సిక్కోలు వైసీపీ ఎంపీ సీటు ఆమెకే?

Date:

ఉత్తరాంధ్రాలో వైసీపీకి చిక్కనిది దక్కనిది సీటు ఉంది అంటే అది శ్రీకాకుళం ఎంపీ సీటు. ఈ సీటుని కొట్టాలని వైసీపీ రెండు ఎన్నికల్లో చేసిన ప్రయత్నం విఫలం అయింది. ముచ్చటగా మూడవసారి 2024 ఎన్నికల్లో వైసీపీ బలమైన ప్రయత్నమే చేస్తోంది.

శ్రీకాకుళం ఎంపీగా పోటీ కోసం దిగ్గజ నేతలను బరిలోకి దింపాలని వైసీపీ హై కమాండ్ చూసింది. మంత్రి ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళం జిల్లా వైసీపీ ప్రెసిడెంట్ ధర్మాన క్రిష్ణదాస్, స్పీకర్ తమ్మినేని సీతారాం, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి వంటి వారి పేర్లు వినిపించాయి. తటస్థుల నుంచి ఒక డాక్టర్ పేరు కూడా పరిశీలనకు వచ్చింది.

ఇప్పుడు ఇవేమీ వర్కౌట్ అయ్యేది కాదని భావించిన హై కమాండ్ శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పిరియా విజయ సాయిరాజ్ పేరు సీరియస్ గా పరిశీలిస్తోందని అంటున్నారు. మహిళా కోటాతో పాటు బీసీ కోటా కూడా భర్తీ అయినట్లుగా అవుతుందని భావిస్తోంది అంటున్నారు.

జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా జిల్లా అంతటా పరిచయాలు ఉంటాయని అది ప్లస్ పాయింట్ అవుతుందని అంచనా వేసుకుంటోంది. ఇచ్చాపురం ఎమ్మెల్యే టికెట్ కోసం ఆమె భర్త మాజీ ఎమ్మెల్యే సాయి రాజ్ ప్రయత్నిస్తున్నారు. ఆ సీటు విషయంలో పోటీ ఉంది.

దాంతో విజయను ఎంపీగా బరిలోకి దింపడం ద్వారా ఇచ్చాపురం ఎమ్మెల్యే సీటుకు కొత్త ముఖాన్ని తీసుకుని రావచ్చు అని వైసీపీ ఆలోచన చేస్తోంది అంటున్నారు. ఇక్కడ సామాజిక వర్గ సమీకరణలు అనుకూలిస్తాయని ఊహిస్తున్నారు. సాయి రాజ్ కాళింగ సామాజిక వర్గానికి చెందిన వారు. శ్రీకాకుళం జిల్లాలో వారి సంఖ్య అత్యధికం, గతంలో వారి నుంచి అనేక మంది ఎంపీలుగా అయ్యారు.

అయితే టీడీపీలో కింజరాపు కుటుంబం హవా మొదలయ్యాక ఎంపీ సీటు ఆ కుటుంబానికే పరిమితం అవుతోంది. దాంతో కాళింగులలో తమకు చాన్స్ కావాలని ఆశలు పెరిగిపోతున్నాయి. దాంతో ఆ సామాజికవర్గం నుంచి కూడా ప్లస్ అవుతుందని విజయని ఎంపీగా పోటీ చేయించాలని చూస్తున్నారు.

విజయ సూర్య బలిజ సామాజికవర్గానికి చెందిన వారు కావడంతో ఆ సామాజిక వర్గం ఓట్లు కూడా వైసీపీకి ఫేవర్ గా టర్న్ అవుతాయని కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పేరులోనే విజయం ఉంచుకున్న విజయ తొలి టెర్మ్ లోనే పోటీ చేసి జెడ్పీ చైర్ పర్సన్ అయ్యారు. అలాగే తొలిసారి ఎంపీ సీటుకు పోటీ పడి శ్రీకాకుళం నుంచి ఎంపీగా గెలుస్తారని వైసీపీకి హాట్ ఫేవరేట్ సీటులో పార్టీ జెండా ఎగరేస్తారని భావిస్తున్నారట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

విజయవాడలో కల్యాణ్‌కు ఘన స్వాగతం

ఏపీ డిప్యూటీ సీఎం, మంత్రి పవన్‌ కల్యాణ్‌ విజయవాడకు చేరుకున్నారు. హైదరాబాద్‌...

ఇంగ్లాడ్ కు బజ్ బాల్ టెస్ట్

క్రికెట్ టెస్ట్ మ్యాచ్ ఫార్మాట్ కు బజ్ బాల్ సాంప్రదాయాన్ని పరిచయం...

ఐపీఎల్ కు రిషబ్ రెడీ

2022లో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ టీం ఇండియా వికెట్ కీపర్...

మరోసారి తండ్రి అయిన విరాట్

టీ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి మరో సారి తండ్రి...