DOT NEWS

అన్నకు నష్టం కలిగేలా.. షర్మిల అడుగులు!ys sharmila speechఅన్నకు నష్టం కలిగేలా.. షర్మిల అడుగులు!

Date:

వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల తప్పటడుగులు వేస్తూనే ఉన్నారు.ఆ అడుగులు తన అన్న ఏపీ సీఎం జగన్కు నష్టం కలిగేలా పరిణమిస్తున్నాయి. తెలంగాణలో రాజన్న రాజ్యం పేరుతో వైఎస్సార్టీపీ అనే సొంత పార్టీని స్థాపించారు. అప్పట్లో పార్టీ పెట్టొద్దని నచ్చ జెప్పామని ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి బహిరంగంగానే ప్రకటించారు. అయితే ఆమె శ్రేయోభిలాషుల మాట వినకుండా తెలంగాణలో పార్టీ పెట్టి, సత్తా చూపేందుకు ప్రయత్నించారు.

కానీ తెలంగాణ సామాజిక పరిస్థితులు షర్మిల రాజకీయ ఎదుగుదలకు దోహదపడలేదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు దారి తీసిన పరిస్థితులు, అక్కడి ప్రజానీకం ఆలోచనలను తెలుసుకోకుండానే ఏదో ఉద్ధరించాలని షర్మిల రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టారు. తెలంగాణలో సుదీర్ఘ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. పాదయాత్రలో నాటి అధికార పార్టీ బీఆర్ఎస్ నేతలపై ఇష్టానుసారం నోరు పారేసుకున్నారు. కొన్ని చోట్ల కాంగ్రెస్ నేతలపై కూడా షర్మిల విమర్శలు చేశారు.

ఎన్ని చేసినా ప్రజల నుంచి తగిన ఆదరణ లభించలేదు. ఎన్నికల సమయానికి ఆమెకి.. తత్వం బోధపడింది. కాంగ్రెస్ అగ్రనాయకులు సోనియాగాంధీ, రాహుల్గాంధీలను ఆమె కలుసుకున్నారు. అనంతరం వాళ్లిద్దరిపై పొగడ్తల వర్షం కురిపించారు. తన తండ్రిపై రాహుల్, సోనియాగాంధీల మనసుల్లో ఏ మాత్రం అభిమానం తగ్గలేదని ప్రకటించారు.

కాంగ్రెస్ లో తన పార్టీ విలీనానికి డెడ్ లైన్ విధించారు. అయితే అటు వైపు నుంచి తగిన స్పందన రాలేదు. దీంతో తెలంగాణ వ్యాప్తంగా తన పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించారు. పోటీ చేయాలనుకునే అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించారు. రెండు రోజులు కూడా గడవకనే షర్మిల యూటర్న్ తీసుకున్నారు. తెలంగాణ ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించారు. కాంగ్రెస్కు బేషరతుగా మద్దతు ప్రకటించారు. ఇదే సందర్భంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిపై నోరు పారేసుకొని తప్పు చేశారు. ఆయనో దొంగ అని, ఉత్తమ్, భట్టి విక్రమార్క లాంటి వాళ్లు సీఎం అయితే బాగుంటుందని చెప్పారు.

తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే కనీసం ఆమెకు కృతజ్ఞతలు చెప్పే దిక్కు కూడా లేదు. కర్నాటకలో డీకే శివకుమార్ మంత్రి అయితే షర్మిల వెళ్లి అభినందనలు తెలియజేశారు. తెలంగాణలో ఆ పరిస్థితి లేకుండా పోయింది.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఏపీపై దృష్టి సారించింది. ఏపీ కాంగ్రెస్ సారథ్య బాధ్యతలు షర్మిలకు ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో పార్టీ పెట్టిన మొదలు, షర్మిల ప్రతి చర్య గౌరవాన్ని తగ్గించుకునేలా వ్యవహరిస్తున్నారు. తాజాగా లోకేశ్ కు క్రిస్మస్ స్పెషల్ గిఫ్ట్ పంపడం ద్వారా వైఎస్సార్ అభిమానుల ఆగ్రహానికి గురయ్యారు. ఈ క్రమంలో ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు తీసుకుని ఆమె ఎవరిని ఉద్దరించాలని అనుకుంటున్నారనే ప్రశ్న ఉత్పన్నమైంది.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో ఏవైనా గొడవలుంటే సానుకూలంగా పరిష్కరించుకుంటే బాగుండేది. అలా కాకుండా అన్నను బ్లాక్ మెయిల్ చేసే పద్ధతిలో రాజకీయంగా రోజుకో నడక సాగిస్తానంటే నష్టం ఎవరికి? జగన్ చెల్లిగా షర్మిలను ముందుకు పెట్టి, ఒకట్రెండు రోజులు ప్రత్యర్థులు గేమ్ ఆడొచ్చు. రోజూ అదే ఆట ఆడుతామంటే కుదురుతుందా?.

ఇప్పటికే తెలంగాణలో షర్మిల అంతోఇంతో ఉన్న గౌరవాన్ని పోగొట్టుకుంది. ఏపీలో రాజకీయ ప్రస్థానం మొదలు పెడితే మాత్రం… వైఎస్సార్ తనయగా కూడా అభిమానించరు. ఎందుకంటే ఆమెకున్న గౌరవం, అభిమానం… కేవలం వైఎస్సార్ బిడ్డ, జగన్ చెల్లిగా అని మాత్రమే. వైఎస్సార్ వారసుడిగా జగన్ కు జనం బ్రహ్మరథం పట్టారు. ప్రస్తుత పరిస్థితుల్లో షర్మిల ఏపీకి వచ్చినా చేసేదేమీ వుండదు. మరింత అన్ పాపులర్ కావడం తప్ప. అయినా షర్మిలకు పోయేదేమీ వుండదు. పోతేగీతే… వైఎస్సార్, జగన్లకు మాత్రమే నష్టం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

విజయవాడలో కల్యాణ్‌కు ఘన స్వాగతం

ఏపీ డిప్యూటీ సీఎం, మంత్రి పవన్‌ కల్యాణ్‌ విజయవాడకు చేరుకున్నారు. హైదరాబాద్‌...

ఇంగ్లాడ్ కు బజ్ బాల్ టెస్ట్

క్రికెట్ టెస్ట్ మ్యాచ్ ఫార్మాట్ కు బజ్ బాల్ సాంప్రదాయాన్ని పరిచయం...

ఐపీఎల్ కు రిషబ్ రెడీ

2022లో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ టీం ఇండియా వికెట్ కీపర్...

మరోసారి తండ్రి అయిన విరాట్

టీ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి మరో సారి తండ్రి...